స్పిరులినా ఓ ఆరోగ్యగని.. దీని గురించి తెలిస్తే వదిలిపెట్టరు..

First Published Apr 9, 2021, 1:45 PM IST

స్పిరులినా గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం. ముదురాకుపచ్చటి రంగులో ఉండే స్పిరులినా పొడిగా, బిళ్లలుగా, పాస్తాలాగా, పిల్లర్స్ లా రకరకాల రూపాల్లో దొరుకుతోంది. దీంట్లో శరీరానికి, మెదడుకు మేలు చేసే అనేక యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

స్పిరులినా గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం. ముదురాకుపచ్చటి రంగులో ఉండే స్పిరులినా పొడిగా, బిళ్లలుగా, పాస్తాలాగా, పిల్లర్స్ లా రకరకాల రూపాల్లో దొరుకుతోంది. దీంట్లో శరీరానికి, మెదడుకు మేలు చేసే అనేక యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.చాలా మంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు తక్కువలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే రోజువారీ ఆహారంలో స్పిరులినాను చేర్చమని సలహా ఇస్తున్నారు. అయితే ముందుగా స్పిరులినా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునేముందు అసలు స్పిరులినా అంటే ఏమిటో తెలుసుకోవాలి.
undefined
స్పిరులినా అంటే..స్పిరులినా అనేది ఉప్పునీరు, మంచినీరు రెండింటిలోనూ పెరిగే అల్గే లాంటి జీవి. ఏకకణ సూక్ష్మజీవుల కుటుంబానికి చెందిన దీనిని నీలం-ఆకుపచ్చ ఆల్గే అని పిలుస్తారు. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా సూర్యకాంతి నుండి శక్తిని ఉత్పత్తి చేయగల సైనోబాక్టీరియం ఇది. ఈ చిన్న ఆల్గే వివిధ రకాల పోషకాలతో నిండి ఉంటుంది.
undefined
ఒక టేబుల్ స్పూన్... అంటే సుమారు 7 గ్రాముల ఎండిన స్పిరులినా పౌడర్‌లో ప్రోటీన్ (4 గ్రాములు), విటమిన్ బి 1 (ఆర్‌డిఎలో 11 శాతం), విటమిన్ బి 2 (ఆర్‌డిఎలో 15 శాతం), విటమిన్ బి 3 (ఆర్‌డిఎలో 4 శాతం), రాగి(ఆర్డీఏలో 21 శాతం), ఐరన్ (ఆర్డీఏలో 11 శాతం) ఉంటాయి. అంతేకాదు 7 గ్రాముల పొడి స్పిరులినాలో 20 కేలరీలు, 1.7 గ్రాముల జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఉంటాయి.
undefined
స్పిరులినా ఆరోగ్య ప్రయోజనాలు ఇవి..దీంట్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీ డీఎన్ఎ కణాలకు హాని కలిగిస్తుంది. దీనివల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక మంటలను కలిగిస్తుంది. స్పిరులినాలోని యాంటీఆక్సిడెంట్లు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి.ఫైకోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ స్పిరులినాకు నీలం-ఆకుపచ్చ రంగును ఇస్తుంది. ఫైకోసైనిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మంటకు కారణమయ్యే అణువుల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
undefined
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల వల్ల అధిక మంది మరణిస్తున్నారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్పిరులినా సహాయపడుతుంది. దీంతోపాటు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల మీద జరిపిన అధ్యయనంలో, రోజుకు 1 గ్రాముల స్పిరులినా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను 16.3 శాతం, చెడు ఎల్‌డిఎల్‌ను 10.1 శాతం తగ్గించిందని తేలింది.
undefined
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి స్పిరులినా మంచి మందు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 25 మందిపై జరిపిన అధ్యయనంలో, రోజుకు 2 గ్రాముల స్పిరులినా ఈ లక్షణాలను బాగా తగ్గించాయని తేలింది.
undefined
స్పిరులినాలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని సూచించే ఆధారాలు ఉన్నాయి. జంతువులపై నిర్వహించిన అధ్యయనాల్లో స్పిరులినా క్యాన్సర్, కణితి పరిమాణాన్ని తగ్గిస్తుందని తేలింది. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌పై స్పిరులినా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట.
undefined
నోటి క్యాన్సర్ తోబాధపడుతున్న భారతదేశానికి చెందిన 87 మంది మీద చేసిన ఒక అధ్యయనంలో.. ఒక సంవత్సరానికి రోజుకు 1 గ్రాముల స్పిరులినా తీసుకున్నవారికి, 45 శాతం మంది గాయాలు కనిపించకుండా పోయాయి. వీరిలో స్పిరులినా తీసుకోవడం ఆపివేసిన వారిలో సగం మంది తరువాతి సంవత్సరంలో గాయాలను తిరిగి కనిపించాయి.
undefined
సమయానికి చికిత్స చేయకపోతే అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోకులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వంటి వివిధ తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. రోజుకు 4.5 గ్రాముల స్పిరులినా రక్తపోటును తగ్గిస్తుందని తేలింది. దీంతోపాటు ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.
undefined
రక్తహీనత ఉన్న40 మంది వ్యక్తుల అధ్యయనంలో, స్పిరులినా మందులు ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచాయి. రోగనిరోధక పనితీరును మెరుగుపరిచాయి.
undefined
వ్యాయామం వల్ల కలిగే ఆక్సిడేటివ్ డ్యామేట్ వల్ల కండరాల అలసటకు గురవుతాయి. కొన్ని ఆహారాలలో యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్నాయి, ఇవి అథ్లెట్లకు బాగా ఉపయోగంగా ఉంటాయి .అలాంటి వాటిల్లో స్పిరులినా ఒకటి..
undefined
నిజానికి రోజుకు ఎంత స్పిరులినా తినొచ్చ అనేది తెలిసి ఉండాలి. దీనిమీద 2016 ఫిబ్రవరి లో నిర్వహించిన, జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 4 గ్రాముల స్పిరులినాను తినొచ్చని సిఫార్సు చేసింది. అయితే, రోజుకు 7 గ్రాముల వరకు తినడం కూడా మంచిదే.. కాకపోతే రోజుకు 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు అని తెలిపారు.
undefined
click me!