పెద్దలతో పోల్చితే పిల్లలే పాలను ఎక్కువగా తాగుతుంటారు. నిజానికి పిల్లలకే కాదు పెద్దలకు కూడా పాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, ఓ పొటాషియం, సోడియం క్లోరైడ్, ఫాస్పెట్, ఐరన్ ఫాస్ఫెట్, కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి.