White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. రంగే వేయక్కర్లే.. ఇలా చేసినా జుట్టు నల్లగా మారుతుంది తెలుసా..

Published : May 13, 2022, 04:15 PM IST

White Hair Treatment: ఒకప్పుడు తెల్లజుట్టు వయసు మీద పడుతున్న వారికే వచ్చేది. ఇప్పుడు యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. కారణం శరీరంలో పోషకాలు లోపించడం. అయితే తెల్ల జట్టును నల్లగా మార్చాలంటే రంగే వేయక్కర్లేదు.. ఇలా చేసినా.. 

PREV
17
White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. రంగే వేయక్కర్లే.. ఇలా  చేసినా జుట్టు నల్లగా మారుతుంది తెలుసా..

White Hair Treatment: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల  జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో పోషకాల లోపం ఉంటే కూడా తెల్లజుట్టు రావడం మొదలవుతుంది. 

27

నిజానికి తెల్ల జుట్టు వయసు మీద పడుతున్న వారికి చిహ్నంగా ఉండేది. కానీ ప్రస్తుతం యువత కూడా తెల్ల జుట్టుసమస్యను ఎదుర్కొంటున్నారు.

37

ఇక ఈ తెల్లజుట్టును వదిలించుకోవడానికి కొందరు మెహందీని ఉపయోగిస్తే.. మరికొంతమందేమో హెయిర్ కలర్స్ ను వాడుతుంటారు. అలాగే పార్లర్లకు వెల్లకుండా ఇంట్లోనే  ఉంటూ నేచురల్ పద్దతిలో జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేసేవారు కూడా ఉన్నారు. ఇలా చేసే వారందరూ జుట్టుకు ఖరీదైన వస్తువులను అప్లై చేస్తుంటారు. కానీ ఏది అవసరమో అది మాత్రం చేయరు. 

47

నిజానికి తెల్లజుట్టు ఉన్నవారు వారు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కానీ పెట్టరు. దీంతో జుట్టు మూలాల నుంచి జుట్టు మొత్తం తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.  ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే..మీ రోజు వారి డైట్ లో ఈ ఆహారాలను   తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

57

గుడ్లు.. శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల జుట్టు చాలా తొందరగా తెల్లబడుతుంది. ఇలాంటి వారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. దీనికోసం మీ రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చండి. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వారంలో రోజుకు ఒక గుడ్డు తింటే జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది. అలాగే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. 

67

బచ్చలికూర.. ఆకుపచ్చని కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బచ్చలికూరలో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అలాగే జుట్టు తెల్లబడటాన్ని కూడా ఆపుతుంది. ఈ కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. 

77

అవకాడో.. అవకాడో మన ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే చిన్న వయసులో వచ్చిన తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు ఈ అవకాడో జుట్టు మూలాలాను కూడా నల్లగా మార్చుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories