Health tips: గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల ఇన్ని రోగాల నుంచి తప్పించుకుంటామా?

Published : Jun 05, 2022, 09:35 AM IST

Health Benefits of Green Apple: గ్రీన్ ఆపిల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

PREV
18
Health tips: గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల ఇన్ని రోగాల నుంచి తప్పించుకుంటామా?
green-apple

Health Benefits of Green Apple: ఆకుపచ్చ రంగులో ఉండే ఆపిల్స్ (Green Apple) కంటే ఎరుపు రంగులో ఉండే ఆపిల్స్ నే ఎక్కువ మంది తింటారు. ఎరుపు ఆపిల్స్ మాదిరిగానే ఆకుపచ్చ ఆపిల్స్ కూడా చాలా పోషకాలను కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్స్ లో విటమిన్ ఎ, సి. కె లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  అయితే ఈ గ్రీన్ ఆపిల్స్ (Green Apple) తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

28

గ్రీన్ ఆపిల్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. ఇది ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఫ్లేవనాయిడ్లు ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనం ప్రకారం.. ఆకుపచ్చ ఆపిల్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) ప్రమాదాన్ని 21 శాతం తగ్గిస్తాయి.

38

ఆకుపచ్చ ఆపిల్స్ లో రుటిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలదు. ఎందుకంటే రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఎంజైమ్ ను ఇది నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఒక ఆకుపచ్చ ఆపిల్ తినడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. 

48

ఆకుపచ్చ ఆపిల్స్ కడుపు ఉబ్బరాన్ని (Flatulence) నివారించడానికి మరియు కడుపులో ఉండే విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడతాయి. ఆకుపచ్చ ఆపిల్స్ సులభంగా జీర్ణమయ్యే ఫైబర్లను కలిగి ఉన్నందున.. ఇది జీవక్రియకు అవసరమైన ఉద్దీపనను అందించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా చక్కెర కోరికలు తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన పండు.

58

పొటాషియం, విటమిన్ కె, క్యాల్షియం సమృద్ధిగా ఉండే గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల మహిళలకు చాలా మంచివి. ఆకుపచ్చ ఆపిల్స్ లో ఉండే విటమిన్ కె మహిళల్లో బోలు ఎముకల (Osteoporosis) వ్యాధిని నివారించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

68

గ్రీన్ ఆపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా.

78

ఆకుపచ్చ ఆపిల్స్ లో ఎరుపు రంగు ఆపిల్స్ కంటే తక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల ప్రయోజనం పొందాలంటే ఆకుపచ్చ ఆపిల్స్ ను తొక్కలతో సహా తినాలని నిపుణులు సలహానిస్తున్నారు.

88
GREEN APPLE

ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే ఆకుపచ్చ ఆపిల్స్..ఇతర ఆహారాలను తినడం వల్ల గుండె జబ్బులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని 35 శాతం తగ్గిస్తాయి. రోజూ గ్రీన్ ఆపిల్స్ తినే వారు గుండెపోటు ప్రమాదాన్ని 13-22 శాతం తగ్గించుకోవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. ఎందుకంటే ఆకుపచ్చ ఆపిల్స్ కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories