నెయ్యితో పిల్లల ఆరోగ్యం పదిలం..!

Published : Jun 20, 2022, 05:00 PM IST

పిల్లలకు రోజూ ఒక చెంచా నెయ్యి పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధులను తగ్గిస్తాయి. పిల్లల్లో గ్యాస్, ఎసిడిటీ వంటి అన్ని రకాల జీర్ణ సమస్యలకు నెయ్యి చక్కటి పరిష్కారం. నెయ్యి ఎముక, దంతాల ఎదుగుదలకు, బలానికి ఎంతో సహాయపడుతుంది. 

PREV
16
నెయ్యితో పిల్లల ఆరోగ్యం పదిలం..!

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వారికి మంచి పోషకాహారం ఇవ్వాలి. పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారంతోనే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తెలివి తేటలు కూడా బాగుంటాయి. అలాగే మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. పోషకాహారంలో నెయ్యి ఒకటి. నెయ్యిలో చాలా పోషకాలు ఉంటాయి. పిల్లల్లో మలబద్దకం నుంచి ఎన్నో సమస్యలకు ఉపశమనం కలిగించడంలో నెయ్యి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. 

26

పిల్లలకు రోజూ ఒక చెంచా నెయ్యి ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధులను తగ్గించగలవు. పిల్లల్లో వచ్చే గ్యాస్, ఎసిడిటీ వంటి అన్ని రకాల జీర్ణ సమస్యలకు నెయ్యి చక్కటి పరిష్కారం. నెయ్యి ఎముకలు, దంతాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే వాటిని బలంగా కూడా తయారుచేస్తుంది. 
 

36

నెయ్యిలో ఉండే ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి నరాలు, మెదడుకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ కొవ్వు ఆమ్లాలు లేకపోవడం వల్లే చిత్తవైకల్యం (Dementia), అల్జీమర్స్ (Alzheimer's)వంటి మెదడుకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కుకగా ఉంటుంది. 

46

పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం నెయ్యిని వారి ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాల ఉంటాయి.  నెయ్యి దగ్గు, జలుబు వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

56

నెయ్యి తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ కనీసం కొద్ది మొత్తంలో నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాల పోషణకు నెయ్యి చాలా అవసరం. నెయ్యిలో ఉండే పోషకాలన్నీ మెదడులోని వివిధ రసాయనిక చర్యలకు అవసరం అవుతాయి.

 

66

నెయ్యి ఎముకల బలంగా,  దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒక చెంచా నెయ్యిలో 112 కేలరీలు ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల.. నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories