వీరభద్రాసనం (Veerabhadrasanam)- వీరభద్ర ఆసనాన్ని యోధుల భంగిమ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో వీరభద్రాసనం చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. ఇది చేతులు (Hands), భుజాలు (Shoulders), తొడలు (Thighs), దిగువ వీపు (Lower back)కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ అవయవాలన్నింతో పాటు స్టామినా కూడా పెరుగుతుంది. అయితే అధిక రక్తపోటు సమస్య ఉన్న వారు ఈ ఆసనాన్నిచేయకూడదు.