ఈ నీటిలో ఉండే మినరల్స్ (Minerals), ప్రోటీన్స్ (Proteins) శరీరానికి శక్తిని అందించి రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతాయి. అదే ఫ్రిజ్ నీటిని తాగితే శరీరానికి ఎటువంటి మినరల్స్, ప్రోటీన్స్ లభించవు. కనుక ఫ్రిజ్ నీటిని తాగితే శరీరం అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంది. కాబట్టి మట్టి కుండలోని నీటిని తాగండి.
ఖనిజాలు
మట్టి కుండలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం వంటి అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. దీని నుండి వచ్చే నీరు తాగడం శరీరానికి చాలా మంచిది.
రోగనిరోధక వ్యవస్థ
మట్టి కుండలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఖనిజాలు ఉంటాయి. వాటిలో నిల్వ చేసిన నీరు తాగడం రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతారు.