Health Benefits of Apples: రోజుకో ఆపిల్ తో ఎన్ని రోగాలు తగ్గుతాయో తెలుసా..!

Published : Jun 21, 2022, 04:56 PM IST

Health Benefits of Apples: రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదంటారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం పదండి.. 

PREV
111
Health Benefits of Apples: రోజుకో ఆపిల్ తో ఎన్ని రోగాలు తగ్గుతాయో తెలుసా..!
apple

ఆపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆపిల్స్ లో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి.

211

ఆపిల్స్ లో వాటర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, విటమిన్ బి6 వంటి అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

311

ఆపిల్స్ లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఆపిల్ పండ్లను క్రమం తప్పకుండా తినేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ.
 

411

ఆపిల్స్ తినే మహిళల్లో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆపిల్స్ ఆస్తమా వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. దీనిలో ఉండే ఫైటోకెమికల్స్,  పాలీఫెనాల్స్ దీనికి సహాయపడతాయి.

511

ఆపిల్స్ తినే మహిళల్లో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆపిల్స్ ఆస్తమా వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. దీనిలో ఉండే ఫైటోకెమికల్స్,  పాలీఫెనాల్స్ దీనికి సహాయపడతాయి.

611

ఆపిల్స్ లో ఉండే ఫైబర్ ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనిలో పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.  స్ట్రోక్ నుంచి రక్షిస్తాయి.

711

ఆపిల్స్ దంత క్షయం సమస్య రాకుండా కూడా మనల్ని కాపాడుతాయి. వీటిని నమలడం వల్ల నోటిలో లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోట్లో బ్యాక్టీరియా చాలా వరకు తగ్గుతుంది. 

811

ఇక  మతిమరుపు సమస్యతో బాధపడేవారికి యాపిల్ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం.. మతిమరుపు సమస్యతో బాధపడేవారు రోజుకో యాపిల్ పండును తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెమోరీ పవర్ పెరుగుతుంది. 

911
apple

ఇక టైప్ 2 డయాబెటీస్ బారిన పడకూడదంటే రోజుకు ఒక ఆపిల్ పండను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక ఆపిల్ పండును తిన్న వారిని ఇతరులతో పోల్చితే టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం 28 శాతం తక్కువగా ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్ చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. 

1011
apple

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఆపిల్ పండు ముందుంటుంది. కనీసం రోజుకు ఒక యాపిల్ పండును తిన్నా.. కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ కరగడం స్టార్ట్ అవుతుంది. దీనిలో ఉండే ఫైబరే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 

1111

అలాగే ఇది అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.  గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఆపిల్ పండును తినకపోతే.. మీరు దీని బెనిఫిట్స్ ను మిస్ అయినట్టే.. 

 

Read more Photos on
click me!

Recommended Stories