
ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా లాక్ డౌన్ నుంచి అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుకుంటూ వస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, గుండె పోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ఎన్నో సమస్యలకు మూలకారణం అధిక బరువు. కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు. దీనికోసం ప్రతిరోజూ వర్కౌట్స్ చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అయితే ఇండియాలో ప్రముఖ పోషకాహార నిపుణుడైన 'నిఖిల్ వాట్స్' ZEE NEWSతో మాట్లాడుతూ.. కొవ్వును, బరువును ఫాస్ట్ గా తగ్గించే చిట్కాలను తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ (Apple)
ఆపిల్ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక యాపిల్ పండును తిన్నా డాక్టర్ అవసరం రాదంటారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పండు అధిక బరువును తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా దీనిలో కేలరీలు, షుగర్ కంటెంట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఈ పండు బరువు తగ్గడానికి చక్కటి ప్రోటీన్ ఫుడ్ అంటారు నిపుణులు.
పుట్టగొడుగులు (Mushrooms)
ఖరీదైన ఆహారాల పదార్థాల్లో ఒకటైన పుట్టగొడుగులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తాయి. అంతేకాదు శరీరంలో అదనంగా ఉండే కొవ్వు నిల్వలను కూడా కరిగిస్తాయి. షుగర్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి కూడా. పుట్టగొడుగుల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫాస్ట్ గా బరువును కూడా తగ్గిస్తాయి.
క్యారెట్లు (Carrots)
క్యారెట్లు కూడా బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో కరిగే, కరగని ఫైబర్లు సులువుగా బరువును తగ్గించడానికి సహాయపడతాయి.
పాప్ కార్న్ (Popcorn)
పాప్ కార్న్ ను సినిమాల్లో తప్ప ఎక్కడా తినని వారు చాలా మందే ఉంటారు. నిజానికి పాప్ కార్న్ లు మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు పాప్ కార్న్ ను ఇంట్లోనే తయారుచేసుకుని తినడం ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ లో దొరికే పాప్ కార్న్ లో ఎక్కువగా సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది బరువును పెంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.