Viral News: బిర్యానీ కోసం 15 ఏళ్ల కెరియర్ త్యాగం.. ఉద్యోగమే వదిలేసి దేశాలు తిరుగుతున్న చెఫ్

Published : Sep 29, 2026, 06:27 PM IST

Viral News: బిర్యానీ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ..దాని కోసం జీవితాన్ని త్యాగం చేయడమంటే విడ్డూరమనే చెప్పాలి. జపాన్‌కు చెందిన ఓ చెఫ్ మాత్రం..బిర్యానీ కోసం ఏకంగా 15 ఏళ్ల కెరియర్ ధారపోశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

PREV
15
బిర్యానీ కోసం జీవితం త్యాగం

బిర్యానీ కోసం జపాన్ నుంచి భారత్‌కు వచ్చి.. చివరికి దాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు ఓ చెఫ్. 15 ఏళ్లుగా బిర్యానీపైనే ప్రయోగాలు చేస్తూ, భారత్‌లోని పలు ప్రాంతాల్లో బిర్యానీ రుచులను ఆస్వాదించిన తకమాసా ఒసావా ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారారు.

‘బిర్యానీ ఒసావా’గా గుర్తింపు పొందిన తకమాసా ఒసావా తొలిసారి 2009లో కోయంబత్తూరులో బిర్యానీ రుచి చూశారు. అప్పటివరకు బిర్యానీ అంటే బియ్యంతో చేసే వంటకం అనే విషయం మాత్రమే ఆయనకు తెలుసు. కానీ ఆ రుచి నచ్చడంతో ఎక్కడికి వెళ్లినా బిర్యానీని వెతుక్కుని మరీ తినడం మొదలుపెట్టారు. ఒసావా అంతకుముందు ముందు బయోఫ్యూయల్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.

25
‘Biriyani Osawa’

ఆ తర్వాత బిర్యానీ తయారీపై ఆసక్తి పెరగడంతో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాలు తిరిగి అక్కడి వంట విధానాలు తెలుసుకున్నారు. హైదరాబాద్, కోల్‌కతా, లాహోర్, ఢిల్లీలో బిర్యానీ రుచి చూసి వాటిలోని ప్రత్యేకతలను తన వంటలోకి తీసుకొచ్చారు.

2021లో టోక్యోలో 10 మంది కూర్చునే రెస్టారెంట్‌ను ప్రారంభించి దానికి ‘Biriyani Osawa’ అని పేరు పెట్టారు. ఆయన రెస్టారెంట్‌కు Michelin Guide Bib Gourmand గుర్తింపు కూడా లభించింది.

35
ఇదే మెయిన్ సీక్రెట్

అయితే ఒసావా కథలో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఒక్క బిర్యానీపైనే ఎందుకు దృష్టి పెట్టారన్నదే. జపాన్‌లో ఒక కళను ఎంచుకుని జీవితాంతం దానిలో నైపుణ్యం సాధించే సంప్రదాయం ఉంది. అదే విధంగా బిర్యానీపై దృష్టిపెట్టానని ఒసావా చెబుతున్నారు.

45
హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం: ఒసావా

ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ తనకు అత్యంత ఇష్టమని చెబుతున్న ఒసావా.. కోల్‌కతా బిర్యానీ నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అంటున్నారు. ఢిల్లీలో బిర్యానీ తినడానికి వెళ్లి కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ చేసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తన బిర్యానీకి హైదరాబాద్ బేస్‌గా తీసుకుని.. కోల్‌కతా మసాలాలు, పాకిస్థాన్ గ్రేవీ, బలూచిస్తాన్ మీట్ వండే విధానం, తమిళనాడు స్టైల్ గ్రేవీని కలిపినట్లు ఒసావా తెలిపారు.

55
రామ్ చరణ్ ప్రశంస

ఒసావా గతంలో హైదరాబాద్‌లో Ram Charan ఇంటికి వెళ్లి, ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా తన బిర్యానీ వండి రుచి చూపించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ బిర్యానీ తిని ఒసావాను ప్రశంసించారు.

Read more Photos on
click me!

Recommended Stories