మురికి నుంచి రక్షణ...
ప్రయాణ సమయాల్లో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్స్ లో మనం లగేజ్ ని.. మోయకుండా.. దానిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాం. దీని వల్ల.. దుమ్మూ, ధూళీ మొత్తం చక్రాలకు అంటుకుంటూ ఉంటుంది. అదే మనం లగేజ్ చక్రాలకు టేపు వేయడం వల్ల... ఆ మురికి చక్రాలకు అంటుకోదు.
ప్రయాణ బీమా సంస్థ ఇన్సూరెన్స్ అండ్ గో సంస్థ నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పబ్లిక్ టాయిలెట్ సీట్లతో పోలిస్తే లగేజీ చక్రాలపై దాదాపు 58 శాతం రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ టేప్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి..?
ఎయిర్‌పోర్టు టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, రోడ్లపై దొర్లే లగేజీ చక్రాలు విపరీతమైన ధూళి, దుమ్ము, జుట్టు, చెత్తను పీల్చుకుంటాయి. వీటికి టేప్ చుట్టడం వల్ల చక్రాల ఉపరితలంపై మురికి నేరుగా చేరకుండా తాత్కాలిక అడ్డుకట్ట వేయవచ్చు. ప్రయాణం ముగిశాక ఆ టేప్‌ను తొలగిస్తే, దానితో పాటు కొంత మురికి కూడా బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల ఆ దుమ్ము, ధూళి వాటికి చేరుకోదు. బ్యాక్టీరియా కూడా చేరదు.
అయితే, ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. టేప్‌ను సరిగ్గా చుట్టకపోతే లేదా మందంగా, వదులుగా చుడితే చక్రాలు సరిగ్గా తిరగకపోవచ్చు. అంతేకాకుండా, టేప్ తొలగించిన తర్వాత మిగిలిపోయే జిగురు మరింత ధూళిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే. ప్రతిసారీ టేప్ చుట్టడానికి బదులుగా, ప్రయాణం అయిపోయిన తర్వాత లగేజీ చక్రాలను శుభ్రం చేసుకోవాలి. వీల్స్ వద్ద ఉన్న జుట్టు, చెత్తను వెంటనే తొలగించాలి.