Coronavirus: కూరలో ఉప్పు, కారం కొంచె అటు ఇటైనా.. చాలా చప్పగా ఉంది.. దీన్ని ఎలా తినడం అంటూ అన్నాన్ని తినని వారు చాలా మంది ఉన్నారు. అలాంటిది పూర్తిగా వాసనను, రుచిని కోల్పోతే ఇక ఆ కూరను ఎలా తినేది? ముందే తినాలనే కోరికను కలిగించడానికి వాసన, రుచులే చాలా ముఖ్యం . మరి ఆ రుచులు, వాసనలే తెలియకపోతే ఫుడ్ ను తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అయితే చాలా మందికి కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రుచి, వాసన తెలియడం లేదు. దాంతో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా కొంతమందికి టేస్ట్ తెలిసినా.. వాసన మాత్రం తెలియడం లేదు. రుచి వాసన తెలియడానికి కొంతమందికి 10 రోజులు పడితే.. మరికొంతమందికి నెల రోజుల సమయం పడుతుంది. 99 శాతం మందికి కొవిడ్ నెగిటీవ్ వచ్చి నెల రోజుల్లోనే వాసన, రుచులు తెలుస్తున్నాయట. కానీ కొందరికి మాత్రం ఈ రుచి వాసన ఎన్ని రోజులు గడిచినా తెలియడం లేదట. ఈ సమస్యలకు ఎటువంటి వైద్యం లేదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.