Kiss Day 2022: వివిధ రకాల ముద్దులకు అర్థమేమిటో తెలుసా?.. లిప్ కిస్‌తో ఏమవుతుందంటే..

Published : Feb 13, 2022, 12:58 PM IST

ఏడు  రోజుల వాలంటైన్స్ డే (Valentine Day)  వీక్‌  జోరుగా  సాగుతోంది. వాటంటైన్స్ డేకు ఒక్క రోజు ముందుగా (అంటూ ఫిబ్రవరి 13) కిస్‌ డే జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్‌లో Kiss Day ఎంతో ప్రత్యేకత ఉంది. 

PREV
19
Kiss Day 2022: వివిధ రకాల ముద్దులకు అర్థమేమిటో తెలుసా?.. లిప్ కిస్‌తో ఏమవుతుందంటే..

ఏడు  రోజుల వాలంటైన్స్ డే (Valentine Day)  వీక్‌  జోరుగా  సాగుతోంది. తొలుత పాశ్చాత్య దేశాలకు పరిమితమైన వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వాటంటైన్స్ డేకు ఒక్క రోజు ముందుగా (అంటూ ఫిబ్రవరి 13) కిస్‌ డే జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్‌లో Kiss Day ఎంతో ప్రత్యేకత ఉంది. 

29
Image: Getty Images

ఎందుకంటే ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది కీలక భూమిక పోషిస్తుంది. చాలా మంది తమ ప్రేమను ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ముద్దు అనేది లవర్స్ మధ్య సన్నిహిత్యం, అప్యాయతలను సూచిస్తుంది. 

39

అయితే ముద్దులో కూడా అనేక రకాల ముద్దులు ఉన్నాయి. చెంప, నుదిటి, పెదవులపై ముద్దు పెట్టుకోవడంలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ముద్దు అనేది ప్రేమికులను మరింత దగ్గర చేయడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు.
 

49

అదేలా అంటే.. ముద్దు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ‘హ్యాపీ హార్మోన్లు’ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు ఆనందాన్ని అనుభవించినప్పుడు విడుదలవుతాయి. ఇవి కార్టిసాల్ లెవల్స్ అనే ఒత్తిడి కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. అంతేకాదు లిప్ కిస్ చేయడం వల్ల పెదవులపై ఉండే నరాలు మధురమైన అనుభూతిని పొందుతాయి. ఆ సమయంలో మనస్సు ఆహ్లాదరకంగా మారుతుంది.

59

నుదిటిపై ముద్దు.. నుదిటి ముద్దు (forehead kiss) అనేది భాగస్వాముల మధ్య భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది. ఇది ఒకరి మధ్య మరోకరికి గౌరవం, నమ్మకాన్ని సూచిస్తుంది. మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో చూపించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. మనస్సు ఆనందంతో నిండిపోయేలా చేస్తుంది. అంతేకాదు ఈ ముద్దు సరికొత్త ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. 
 

69

బుగ్గలపై ముద్దు.. చెంప మీద ముద్దు (kiss on cheek) అనేది మీకు తెలిసిన లేదా ప్రేమించే ఎవరికైనా ఇచ్చే ఆప్యాయత యొక్క స్నేహపూర్వక సంకేతం. మీరు వ్యక్తిని ఇష్టపడుతున్నారని ఇది సూచిస్తుంది. భాగస్వాములు మాత్రమే కాకుండా స్నేహితుల కూడా బుగ్గలపై ముద్దులు ఇచ్చి పుచ్చుకుంటుంటారు.

79

పెదవులపై ముద్దు(kiss on the lips)..పెదవులపై ముద్దు అనేది ఇద్దరు భాగస్వాముల మధ్య పంచుకునే శృంగార ముద్దుగా పరిగణించబడుతుంది. ఎవరి జీవితంలోనైనా ఫస్ట్ లిప్ కిస్ అనేది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అది హృదయంలో, మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతుంది. లిప్ కిస్‌తో భాగస్వాములు సరికొత్త మైకంలోకి వెళతారు. అంతేకాదు ముద్దు ఎక్కువ సేపు కొనసాగితే వారిని హద్దులు దాటేలా చేస్తుందట.

89

ముద్దలు వల్ల ప్రయోజనాలు.. మీకు తెలుసా.. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ ముద్దు Blood pressure ను తగ్గించడంతో పాటుగా Heart rate ను కూడా నియంత్రించగలదని నిపుణులు చెబుతున్నారు.
 

99

ముద్దుతో రక్త ప్రవాహం కూడా మెరుగుపడుతుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటుకు కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరానికి అయిన గాయాల నొప్పి కూడా తగ్గిస్తుంది. కిస్ చేసినప్పుడు రక్తనాళాల విస్తరణ వల్ల గాయాల వల్ల కలిగే నొప్పి మటుమాయం అవుతుందట.

click me!

Recommended Stories