Kidney Health: ఆల్కహాల్ మాత్రమే కాదు ఇవి కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తయ్ జాగ్రత్త..

Published : Apr 18, 2022, 01:25 PM IST

Kidney Health: మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతాయి. ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగితే మీ ప్రాణాల మీదికి రావొచ్చు. 

PREV
19
Kidney Health: ఆల్కహాల్ మాత్రమే కాదు ఇవి కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తయ్ జాగ్రత్త..
kidney

Kidney Health: మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పంపబడతాయి. కాగా మూత్రపిండాలు మూత్రాన్ని ఏర్పరచడంతో పాటుగా రక్తపోటును నియంత్రించే హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. 

29

అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాలు మూత్ర పిండాలు దెబ్బతినేలా చేస్తాయి. చెడు జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో రాళ్లు, మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక ప్రమాదకర జబ్బులు సోకే ప్రమాదం ఉంది. 

39
kidney

మూత్రపిండాల విధి.. మన శరీరంలో ఉన్న మలినాలను, మురికిని మూత్రం ద్వారా తొలగిస్తాయి. అయితే కొన్ని అలవాట్ల వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బతినే  ప్రమాదం ఉంది. ఈ సమస్యను మొదట్లో గుర్తిస్తే ఎటువంటి ప్రమాదం లేదు.. కానీ కొంతమందిలో ఈ సమస్య చివరి దశలో గుర్తించబడుతుంది. దీనివల్ల వారు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

49

మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు..

ఆకలి మందగించడం

శరీర వాపు

చలి ఎక్కువగా పెట్టడం

చర్మంపై దద్దుర్లు 

మూత్రవిసర్జనలో ఇబ్బంది కలగడం

చికాకుగా అనిపించడం

59

మూత్రపిండాలను దెబ్బతీసే విషయాలు..
ఆల్కహాల్.. ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల మూత్ర పిండాలు చెడిపోయే ప్రమాదం ఉంది. నిత్యం తాగడం వల్ల కిడ్నీల పనితీరులో సమస్యలు వస్తాయి. దీంతో కూడా బ్రెయిన్ పై ప్రభావం పడుతుంది. ఆల్కహాల్ ను సేవించడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడమే కాదు .. మీ శరీరంలో ఎన్నో అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది. 

69

ఉప్పు.. ఉప్పులో సోడియం ఉంటుంది. మోతాదులో ఉప్పును తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు కానీ.. ఉప్పు క్వాంటిటీ ఎక్కువైతే మాత్రం శరీరంలోని ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. దీంతో మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

79

పాల ఉత్పత్తులు.. పాల ఉత్పత్తులైన వెన్న, పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాలకు ఏ మాత్రం మంచిది కాదు. ఈ పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇకపోతే పాలల్లో క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడెలా చేస్తుంది. కాబట్టి వీటిని తక్కువగానే తీసుకోండి. 

89

రెడ్ మీట్.. రెడ్ మీట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు మన శరీరానికి అవసరమే అయినప్పటికీ.. రెడ్ మీట్ అంత తొందరగా జీర్ణం కాదు. దీనివల్ల మన శరీరానికి కష్టం గా మారుతుంది. దీంతో మూత్రపిండాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 

99

కృత్రిమ స్వీటెనర్..కృత్రిమ స్వీటెనర్లు ఎక్కువగా ఉండే స్వీట్లు, పానీయాలు, కుకులీ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకుంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories