హ్యాపీ టెడ్డీ డే.. మీ లవ్ కు ఏరంగు టెడ్డీ ని ఇస్తున్నారు..? ఒక్కో కలర్ టెడ్డీ ఒక్కో భావాన్నిచూపిస్తుంది ..

First Published | Feb 10, 2022, 9:58 AM IST

Teddy Day: చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే.. పెద్దవాళ్ల వరకు టెడ్డీ బేర్ లంటే తెగ ఇష్టపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలైతే రాత్రి పడుకునే ముందు కూడా వాటినే పట్టుకుని పడుకుంటారు. 
 

Teddy Day:వాలెంటైన్ వీక్ మొదలు కావడంతో ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఈ వీక్ లో చూస్తుండగానే నాలుగో రోజు రానే వచ్చింది. నిన్న చాకెలేట్ డే జరుపుకున్న ప్రేమికులు ఈ రోజు టెడ్డీ బేర్ డే జరుపుకోనున్నారు. ప్రియమైన వాళ్లకు తమ లవర్ పై ఉన్న ప్రేమను తెలిపేందుకు టెడ్డీ బేర్ కు మించిన గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. 

ఈ టెడ్డీ డే రోజున రంగురంగుల టెడ్డీ బేర్ లు ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా.. ఈ రోజు ఎన్నో టెడ్డీ బేర్ లు భారీగా అమ్ముడు పోతాయి. కాగా ఈ టెడ్డీ డే రోజున ప్రియుడు లేదా ప్రేయసి తమ లవర్ కు టెడ్డీని ప్రెజెంట్ చేసి తమ మనసులోని ప్రేమను తెలియజేస్తారు. అంతేకాదు ఈ టెడ్డీలంటే అమ్మాయిలకు మహాఇష్టం. అందుకే తమ లవర్లకు ఈ టెడ్డీ బేర్లను ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే ఒక్కో కలర్ టెడ్డీ బేర్ ఒక్కో భావాన్ని తెలియజేస్తుంది. మరి ఏ కలర్ టెడ్డీ బేర్ ఎలాంటి భావాన్ని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..



రెడ్ కలర్ టెడ్డీ బేర్:  అన్ని కలర్ల టెడ్డీ బేర్లలో రెడ్ కలర్ టెడ్డీ బేర్ కే ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ కలర్ టెడ్డీని ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ  రెడ్ కలర్ టెడ్డీ బేర్ మీ ప్రేయసి లేదా ప్రియురాలిపై ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ బహుమతితో మీ బంధం మరింత  ధృఢంగా మారుతుంది. ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ ఇతరులపై ఉన్న ఇష్టాన్ని తెలిపే వారధిలా కూడా పనిచేస్తుంది.

పింక్ టెడ్డీ బేర్: పింక్ కలర్ టెడ్డీ బేర్ అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. ఈ పింక్ కలర్ టెడ్డీ బేర్ ప్రేమను, అనుబంధాన్ని, స్నేహాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు మీరు ఒకరిని ఇష్టపడుతున్నట్టైతే.. వారికి పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇవ్వండి.

నీలం టెడ్డీ బేర్: ఈ నీలం రంగు ఎన్నో భావాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ కలర్ టెడ్డీ బేర్ ను ఒకరికి ఇస్తే.. వారికి మీరు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తానని మీరు ప్రామిస్ చేసినట్టే. అది ప్రేమలో అయినా కావొచ్చు. పెళ్లి అయ్యాక కూడా కావొచ్చు. ఈ నీలం రంగు టెడ్డీని ఒకరికి ఇస్తే వారి చేయి చేయిని ఎప్పటికీ వదలనని అర్థం.

గ్రీన్ కలర్ టెడ్డీ బేర్: ఆకుపచ్చ టెడ్డీ బేర్ మీ సహానానికి, ఓర్పుకు ప్రతీక. ఈ కలర్ టెడ్డీని ఒకరికి ఇస్తే.. వారికోసం, వారి ప్రేమకోసం ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తానని మీరు భావించినట్టే

ఆరెంజ్ కలర్ టెడ్డీ బేర్:  ఈ ఆరెంజ్ కలర్ టెడ్డీ బేర్ ఇతరపై ఉన్న ఇష్టాన్ని, వారి వల్ల మీలో కలిగిన మార్పులను తెలియజేస్తుంది. అంతేకాదు ఈ రంగు టెడ్డీ బేర్ ఆశకు, ఆనందానికి సూచికగా భావిస్తారు. ఈ టెడ్డీ డే నాడు మీ ప్రియమైన వారికి ఈ రంగు టెడ్డీని ప్రెజెంట్ చేసి వారిపై ఉన్న ప్రేమను.. వారి వల్ల కలిగిన మీలో మార్పులను వారికి తెలియజేస్తే వారెంతో సంతోషిస్తారు తెలుసా.. 

Latest Videos

click me!