మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.. మీ బెస్ట్ ఫ్రెండ్ కు బెస్ట్ విషెస్ ఇలా చెప్పేయండి

Published : Aug 06, 2023, 09:46 AM IST

మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడేం కాడు.. మన గుండెల్లోనే ఉండేవాడు.. కనుపాపలకెందుకు ఎదురైరాడు.. అన్న పాట మన ఫ్రెండ్స్ తో ఉన్న ఎన్నో మెమోరీస్ ను గుర్తుచేస్తుంది. స్నేహితుడు అనే మాట చిన్నదేనైనా.. ఫ్రెండ్ లేని జీవితం ఊహించుకోవడం కష్టం. సంతోషంలోనే కాదు కష్టాల్లోనే నేను నీకున్నానురా అని ధైర్యం చెప్పేవాడే స్నేహితుడు.   

PREV
16
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.. మీ బెస్ట్ ఫ్రెండ్ కు బెస్ట్ విషెస్ ఇలా చెప్పేయండి
happy friendship day

నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే చాలు.. జీవితంలో మంచి విజయం సాధించడానికి, సంతోషంగా కాలాన్ని గడపడానికి. స్నేహం అంటే ప్రతిరోజూ మాట్లాడుకోని.. ఎప్పుడూ ఒకే చోట ఉండటం కాదు. మంచి స్నేహానికి రోజువారీ సంభాషణలు అవసరం లేదు. ఎల్లప్పుడూ ఐక్యత కూడా అవసరం లేదు. స్నేహం హృదయంలో ఉన్నంత కాలం నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. స్నేహితులు నక్షత్రాల వంటివారు. జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించి .. ప్రతి క్షణాన్ని చిరస్మరణీయం చేస్తారు. ఫ్రెండ్స్ కలిసి నవ్వడానికి, మెమోరీస్ ను జ్ఞాపకం చేసుకోవడానికి, కొత్త జ్ఞాపకాలను సృష్టించడానికి ఇది ఒక రోజు. 

26
happy friendship day

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. 2023లో ఆగస్టు 6న అంటే ఈ రోజే ఫ్రెండ్ షిప్ డే. ఐక్యరాజ్యసమితి జూలై 30న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. భారతదేశం మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్నే స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటోంది. మరి ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఫ్రెండ్ కు ఎలా విష్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

స్నేహితులు ఆకాశంలో నక్షత్రాల వంటివారు. మీరు ఎప్పుడూ వాటిని గమనించకపోవచ్చు, కానీ వారు మాత్రం మిమ్మల్నిఎప్పుడూ  గమనిస్తూ ఉంటారు.

ఎవరైనా.. ఎప్పుడైనా మీ మనస్సులో ఉండొచ్చు. కానీ కొద్దిమంది మాత్రమే మీ హృదయంలో ఎల్లడూ ఉండిపోతారు. అందులో నువ్వున్నావు ఫ్రెండ్..  హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే
 

46

స్నేహితుడు మీ ముందు నడవడు. కానీ అతను మీ పక్కనే నడుస్తాడు. ఎందుకంటే మీరు పడిపోకుండా మిమ్మల్ని పట్టుకోవడానికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్

నువ్వు నా స్నేహితుడిగా ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. మీలాంటి స్నేహితులు ఎప్పటికీ గుండెల్లోనే ఉంటారు. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్ బెస్ట్ ఫ్రెండ్. నిన్ను చాలా మిస్ అవుతున్నా!

56


పరిస్థితులు ఎలా ఉన్నా అన్నివేళలా నాకు అండగా నిలిచినందుకు చాలా చాలా థాంక్స్.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

నా జీవితంలో నీలాంటి స్నేహితుడు ఉండటం ఒక వరం. నన్ను అర్థం చేసుకుని నాకు అండగా ఉన్న నీకు ఏమిచ్చినా తక్కువే.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే డియర్ ఫ్రెండ్

హే బెస్టీ.. మనం శరీరాలు వేరు వేరు ప్లేసెస్ లో ఉండొచ్చు. కానీ మన హృదయాలు ఒకే ఉత్సాహాన్ని పంచుకుంటాయి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
 

66

అందరూ నాలోని చెడును మాత్రమే వెతికే పనిలో బిజీగా ఉంటే.. నువ్వు మాత్రం నా మంచిపై దృష్టి పెట్టడానికి నాకు సహాయపడ్డారు. నా రాక్ అయినందుకు ధన్యవాదాలు రా.

ఒక మంచి స్నేహితుడు నిజంగా జీవితాన్ని మెరుగుపరుస్తాడు. ప్రతిరోజూ నన్ను సంతోషంగా, నవ్వించే స్నేహితుడికి అభినందనలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

నీకు తెలుసా? నిన్ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

చెప్పని విషయాలను కూడా అర్థం చేసుకుని ఎలాంటి సలహాలు లేకుండా నాకు సపోర్ట్ చేసే స్నేహితుడు నువ్వు.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 
 

click me!

Recommended Stories