1. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ జగన్మాత ఆశీస్సులతో మీ ఇంట ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
2. దుర్గాభవాని దివ్య కృపాకటాక్షాలతో
మీరు తలపెట్టిన ప్రతి కార్యం
దిగ్విజయంగా పూర్తి కావాలని మనసారా ఆకాంక్షిస్తూ...
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు.
3. ఈ విజయదశమి మీ జీవితంలోని
ప్రతికూలతలను తొలగించి,
నవ చైతన్యాన్ని, నిండు సంతోషాన్ని
నింపాలని కోరుకుంటూ... హ్యాపీ దసరా!
4. ధర్మం, న్యాయం, సత్య మార్గంలో నడిచేవారికి
ఎల్లప్పుడూ విజయమే లభిస్తుందని గుర్తుచేసే పండుగ దసరా.
కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు సదా ఉండాలని
కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!
5. ఈ దసరా పండుగ మీ ఇంట సిరిసంపదల కాంతులు నింపి,
అనుకున్న లక్ష్యాలను చేరుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ...
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!