పొడవైన జుట్టు కోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..

Published : Mar 19, 2022, 01:51 PM IST

hair growth tips: జుట్టుంటేనే అందం, ఆనందం. అందుకోసమే అమ్మాయిలు అబ్బాలు అంటూ తేడా లేకుండా జుట్టు సంరక్షణ చర్యలు చేపడుతుంటారు. 

PREV
17
పొడవైన జుట్టు కోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..

ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. లేని జుట్టుకోసం ప్రయత్నించడం మానేసి.. ఉన్న జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్న వారు. అయితే కొన్ని చిట్కాలు హెయిర్ ఫాల్ ను నివారించడమే కాదు.. జుట్టును వేగంగా పెంచుతాయి కూడా. అవేంటంటే.. 

27
रेगुलर ऑयलिंग करें

మసాజ్: హెయిర్ ప్యాక్ లు, నూనెలతో పాటుగా తరచుగా మసాజ్ చేస్తూ ఉండండి. వీటి వల్ల జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అంతేకాదు దీనివల్ల హెయిర్ మందంగా తయారవుతుంది కూడా. మర్దన వల్ల జుట్టు పెరగడంతో పాటుగా, హెయిర్ ఫాల్ సమస్య కూడా తొలగిపోతుంది. 

37

ఉల్లిరసం: ఉల్లిపాయ సరం స్మెల్ బాలేకపోయినా.. దీనిలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఉల్లిరసాన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని తలకు రాసి 15 నిమిషాల తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయాలి. ఇలా వద్దనుకుంటే ఉల్లిరసాన్ని ఒక గ్లాస్ తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 

47

కొబ్బరినూనె: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె ఎంతో అవసరం. ఇందులో లారిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు ప్రోటీన్ ను కోల్పోకుండా కాపాడుతుంది. ఇందుకోసం స్నానం చేసే ఒక గంట ముందు జుట్టుకు మంచిగా కొబ్బరినూనెను పట్టించి.. ఆ తర్వాత జుట్టును షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఈ పద్దతిని పాటిస్తే మీ జుట్టు షైనీగా ఉంటుంది. 

57

కలబంద: కలబందలో అద్బుత ఔషదగుణాలున్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. అంతేకాదు ఇది జుట్టుకు మంచి కండీషనర్ లా కూడా పనిచేస్తుంది. కలబంద చుండ్రు సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు కలబంద గుజ్జును అప్లై చేయాలి.     
 

67

నిమ్మకాయ: జుట్టు ఫాస్ట్ గా పెరిగేందుకు , హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ రసం లేదా నిమ్మనూనెలో ఏదైనా జుట్టుకు అప్లై చేస్తే.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి స్కాల్ప్ ను హెల్తీగా ఉంచుతాయి. అంతేకాదు ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది కూడా. ఇందుకోసం.. జుట్టుకు షాంపూ పెట్టడానికి 15 నిమిషాల ముందు నిమ్మరసాన్ని అప్లై చేయండి. 
 

77

గ్రీన్ టీ: ఇందులో Catechins అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి DTH ను తగ్గిస్తాయి. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ సమస్యను కూడా తగ్గిస్తుంది. చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది కూడా. అలాగే జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టును పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.  
 

Read more Photos on
click me!

Recommended Stories