Health Tips: ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచే ఆహార పదార్థాలు ఇవే..

Published : Mar 13, 2022, 12:39 PM IST

Health Tips: కరోనా కారణంగా ఆస్పత్తుల పాలైన వారికి ఆక్సిజన్ ఎంతగా అవసరమయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా కనిపించిన ఎంతో మందికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి.. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. 

PREV
18
Health Tips: ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచే ఆహార పదార్థాలు ఇవే..

Health Tips: ఆక్సిజన్ అవసరం ఎంతుందో జనాలకు కరోనా మహమ్మారితోనే తెలిసొచ్చింది. కరోనా సోకిన ఎంతో మంది ఆరోగ్యంగానే కనిపించినా.. ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం పూర్తిగా తగ్గిపోయి.. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే.. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఈ ఆక్సిజన్ లెవెల్స్ ను ఎలా పెంచుకోవాలో.. ఇందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

28

ప్రస్తుతం వాయు కాలుష్యం దారుణంగా పెరిగింది. ఈ కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారిన పడతున్నారు. అయితే  ఇలాంటి వారికే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

38

ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది తాజా పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుందట. ఇందుకు ఎలాంటివి తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

48

అరటి పండ్లు:   అరటిపండ్లలో ఆల్కలీన్ శాతం ఎక్కువగా ఉండటంతో పాటుగా PH value 4.5 - 4.7 వరకు ఉంటుంది. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు బాగా పండినవి లేదా ఖచ్చివి తినండి. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. 

58

నిమ్మకాయ: ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది కూడా.
 

68

వెల్లుల్లి:  వెల్లుల్లిలో ఎన్నో అద్బుత ఆరోగ్యకరమైన గుణాలున్నాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ వెల్లుల్లిలో ఆల్కలీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంటో PH value 8 కంటే ఎక్కువే ఉంటుంది. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఎంతో తోడ్పడుతాయి.  అంతేకాదు క్రమం తప్పకుండా ఉదయం పూట పరిగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగతాయని నిపుణులు చెబుతున్నారు. 

78

కీరదోసకాయ: ఎండాకాలంలో  ఈ కీరదోసను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో నీటి శాతం ఎక్కువ మొత్తంలో ఉండటంతో బాడీని డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చక్కటి డైట్. అంతేకాదు ఈ కీర మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను కూడా పెంచుతాయి. 

88

బొప్పాయి: బొప్పాయి పండులో ఆరోగ్యానికి మేలు చేసే ఔషద గుణాలున్నాయి. ఈ పండులో  PH value 8.5 కంటే ఎక్కువే ఉంటుందట. ఇవి మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచడానికి ఎంతో తోడ్పడుతాయి. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా దీనిని తినొచ్చు. 

click me!

Recommended Stories