
Hair Fall: మారుతున్న జీవన శైలి కారణంగా ఎంతో మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయినా ఇప్పుడు ఒత్తైన, పొడవైన జుట్టు ఉండటం గగనమైపోయింది. నూటిలో ఒక్కరు ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్యలు లేకుండా ఉంటున్నారు. మెజారిటీగా మాత్రం జుట్టు ఊడిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు.
దీనికి కారణాలు లేకపోలేదు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నీళ్లను సరిగ్గా తాగపోవడం, ఒత్తిడి వంటివి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఇవే కావు మారుతున్న వాతావరణం కారణంగా కూడా చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలన్నా.. దీని బారిన పడకూడదన్నా కొన్ని ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. పోషకాలు అందినప్పుడే జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. ఇంతకీ డైట్ లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్.. చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్న వారు.. రకరకాల షాంపూలను, నూనెలను, కండీషనర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ వాడినా.. జుట్టు ఊడిపోయే సమస్య మాత్రం దూరం కాదు. దీనికి కారణం మీ శరీరంలో పోషకాలు లేకపోవడమే. అవును పోషకాల లోపం ఏర్పడటం వల్లే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇందుకోసం మీరు మీ రోజు వారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకు గుడ్లు తినండి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు గుడ్డు హెయిర్ మాస్క్ ను వేసుకున్నా.. జుట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే జుట్టు మొదల్లను కూడా బలంగా చేస్తుంది. గుడ్లలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు మూలాలను స్ట్రాంగ్ చేయడానికి, హెయిర్ ఫాల్ నుంచి బయటపడేయడానికి సహాయపడుతుంది.
సీ ఫుడ్స్.. జట్టు ఊడిపోయే సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా సీఫుడ్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీఫుడ్ మీ జుట్టును బలంగా మారుస్తుంది. ఇందుకోసం సాల్మన్, హిల్సా వంటి సముద్రపు చేపలను తినండి. వీటిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ రక్తం తయారయ్యేందుకు ఎంతో సహాయపడుతుంది.
జుట్టు ఊడిపోవడం ఆగాలంటే విటమిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలకూర, చికెన్, మటన్, బెల్లం, లివర్ అయాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు చాలా ఫాస్ట్ గా పెరిగేందుకు సహాయపడుతుంది.