మగాళ్లకు మాత్రమే : జుట్టు బాగా ఊడిపోతుందా? తెల్లజుట్టు వస్తోందా? కారణాలివే...

First Published Sep 15, 2021, 4:42 PM IST

వాతావరణ కాలుష్యం, జీవనశైలి మార్పులు ఆరోగ్యం మీద, చర్మం మీద ప్రభావం చూపిస్తాయని తెలిసిందే. అయితే ఈ కాలుష్యం జుట్టు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. తొందరగా తెల్లబడేలా చేస్తుంది. దీంతోపాటు  జెనెటిక్స్ సమస్య, విటమిన్ లోపాలు, ఆక్సీకరణ స్ట్రాస్, కొన్ని రకాల మెడికల్ కండీషన్స్, ఒత్తిళ్లు కూడా జుట్టు తెల్లబడడానికి, పలచబడడానికి కారణమవుతాయి. 

మహిళలే కాదు పురుషులూ జుట్టుకు రకరకాల రంగులు వేయడం ఇప్పుడు ఫ్యాషన్. స్ట్రీక్స్, హెయిర్ ఫుల్ కలర్ ఛేంజ్ లతో డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నారు. అయితే దీనికోసం వాడే హెయిర్ డైని బట్టి కలరింగ్, బ్లీచింగ్ లేదా హైలైట్ వేయడం వల్ల జుట్టుకు చాలా నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

దీనికోసం అమ్మోనియా లేని కలర్ వాడడం మంచిదే.. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. పర్మినెంట్ హెయిర్ డై వల్ల ఇంకా తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు. జుట్టు రాలడం, చిట్లిపోవడం లాంటి హెయిర్ డ్యామేజ్ కు కారణమవుతుంది. 

ఇలా జరగకుండా ఉండాలంటే మీ హెయిర్ స్టైలిస్ట్ సిఫారసు చేసిన మంచి షాంపూ,  కండీషనర్‌ని వాడండి. కలర్ వేసేప్పుడు కూడా జుట్టు కుదుళ్లకు అంటకుండా ఉండేలా చూడమని చెప్పండి. తద్వారా జుట్టు క్యూటికల్ నుండి దెబ్బతినకుండా ఉంటుంది. రాలిపోకుండా ఉంటుంది. జుట్టు రాలడం అనేది జుట్టుకు వాడే రంగు, చేసే స్టైలిస్ట్ మీద ఆధారపడి కూడా ఉంటుంది. 

అయితే జుట్టు ఊడడం అనేది మాత్రం కామన్ గా జరుగుతుంది. నష్టనివారణను కొంతైనా తగ్గించాలంటే మంచి బ్రాండెండ్ హెయిర్ కలర్ నే వాడాలి. జుట్టును రకరకాల స్టైలింగ్స్ చేయడం దీనికోసం స్ప్రేలు, కలర్స్ వాడడం వల్ల జుట్టు త్వరగా నెరిసే అవకాశం ఉంది. నష్టం కూడా శాశ్వతంగా ఉంటుంది. దీనినుంచి నివారణకు రాత్రికి జుట్టుకు బాగా నూనె రాసి, మరుసటి రోజు బేబీ షాంపూతో కడిగి కండిషనర్ అప్లై చేయాలి.

పురుషుల్లో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు హెయిర్ కలరింగ్, కెరాటిన్ లేదా సిస్టీన్ వంటి హెయిర్ ట్రీట్‌మెంట్‌లు. కలర్, పమ్, స్ట్రెయిట్ లేదా హెడ్‌లైట్ చేసినప్పుడు జుట్టు నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇది జుట్టు పీహెచ్ స్థాయిని పెంచుతుంది. మన శరీరానికి, జుట్టుకు నీరు చాలా ముఖ్యం. జుట్టు కూడా గోళ్లలాగానే మృతకణాలతో తయారవుతుంది. ఈ మృతకణాలు క్యుటికల్‌ని కలిగి ఉంటాయి. దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది. హెయిర్ కలరింగ్ జుట్టును దెబ్బతీస్తుంది. తద్వారా  మళ్లీ మాయిశ్చరైజర్, గ్లో, షైన్, ఆయిల్‌నెస్ వంటి సిరెట్ ట్రీట్మెంట్‌ను ఉపయోగిస్తాం.

పురుషుల్లో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు హెయిర్ కలరింగ్, కెరాటిన్ లేదా సిస్టీన్ వంటి హెయిర్ ట్రీట్‌మెంట్‌లు. కలర్, పమ్, స్ట్రెయిట్ లేదా హెడ్‌లైట్ చేసినప్పుడు జుట్టు నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇది జుట్టు పీహెచ్ స్థాయిని పెంచుతుంది. మన శరీరానికి, జుట్టుకు నీరు చాలా ముఖ్యం. జుట్టు కూడా గోళ్లలాగానే మృతకణాలతో తయారవుతుంది. ఈ మృతకణాలు క్యుటికల్‌ని కలిగి ఉంటాయి. దీంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది. హెయిర్ కలరింగ్ జుట్టును దెబ్బతీస్తుంది. తద్వారా  మళ్లీ మాయిశ్చరైజర్, గ్లో, షైన్, ఆయిల్‌నెస్ వంటి సిరెట్ ట్రీట్మెంట్‌ను ఉపయోగిస్తాం.

వాతావరణ కాలుష్యం, జీవనశైలి మార్పులు ఆరోగ్యం మీద, చర్మం మీద ప్రభావం చూపిస్తాయని తెలిసిందే. అయితే ఈ కాలుష్యం జుట్టు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. తొందరగా తెల్లబడేలా చేస్తుంది. దీంతోపాటు  జెనెటిక్స్ సమస్య, విటమిన్ లోపాలు, ఆక్సీకరణ స్ట్రాస్, కొన్ని రకాల మెడికల్ కండీషన్స్, ఒత్తిళ్లు కూడా జుట్టు తెల్లబడడానికి, పలచబడడానికి కారణమవుతాయి. 

ఈ కారణం వల్ల కూడా నలుగురిలో ఇబ్బంది రాకుండా ఉండాలని కలర్ వేయడం ప్రారంభించారు. అయితే ఆ హెయిర డైలో పీపీడీ, పీటీడీ, రిసోర్సినల్, ఫథోలెట్స్, ఎస్ఎల్ఎస్, టైటానియం డయాక్సైడ్, పారాబెన్‌లు లేవని నిర్థారించుకున్నాకే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!