జుట్టు విపరీతంగా రాలుతోందా? వీటిని తినండి జుట్టు అసలే ఊడదు

Published : Oct 02, 2023, 04:29 PM IST

జుట్టు మన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. జుట్టు రాలకూడదని రకరకాల షాంపూలు, నూనెలను వాడుతుంటారు. అయినా జుట్టు రాలడం మాత్రం ఆగదు. ఇలాంటప్పుడు మీ జుట్టు పోషకాల లోపం వల్ల ఊడిపోతుందని అర్థం చేసుకోవాలి. మన శరీరంలో పోషకాలు పుష్కలంగా జుట్టు బలంగా ఉంటుంది. ఊడే ఛాన్సే ఉండదు.   

PREV
17
జుట్టు విపరీతంగా రాలుతోందా? వీటిని తినండి జుట్టు అసలే ఊడదు
foods for hair

నా జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. అందుకు తగ్గట్టు రకరకాల షాంపూలు, నూనెలను ట్రై చేస్తుంటారు. కానీ సరైన పోషకాలను మాత్రం తీసుకోరు. ఇదే మన వెంట్రుకలు ఊడేలా చేస్తుంది. అవును శరీరంలో పోషకాలు లోపిస్తే జుట్టు బలహీనంగా మారి విపరీతంగా రాలే అవకాశం ఉంది. అదే శరీరంలో పోషకాలు పుష్కలంగా ఉంటే మీ జుట్టు బలంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు బలంగా ఉండాలంటే మాత్రం అందుకు మనం కొన్ని రకాల పోషకాలను తీసుకోవాలి. హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా కొన్ని రకాల పోషకాలను తీసుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది.  అందులో విటమిన్ ఎ ఒకటి. అవును విటమిన్ ఎ మన జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. మరి ఈ విటమిన్ కోసం ఏయే ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

బచ్చలికూర

బచ్చలికూర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకుపచ్చని ఆకులు విటమిన్ల భాండాగారం. ఈ కూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఫోలేట్,  జింక్ లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను తింటే మన శరీరంలో ఎన్నో పోషకాల లోపాలు పోతాయి. కాబట్టి పాలకూరను మీ డైట్ లో చేర్చుకుంటే మీ జుట్టు రాలే సమస్యే ఉండదు. బలంగా కూడా ఉంటుంది. 
 

37

క్యారెట్లు

క్యారెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి విటమిన్ ఎ కు మంచి వనరు. అయితే క్యారెట్లు కేవలం కళ్లను మాత్రమే ఆరోగ్యంగా ఉంచుతాయని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే.. క్యారెట్లను తినడం వల్ల కంటిచూపు పెరగడంతో పాటుగా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యల రిస్క్ తగ్గుతుంది. 
 

47
Tomatoes

టమాటాలు

టమాటాలు లేని కూర ఉండదేమో. మనం చేసే ప్రతి కూరలో టమాటాలను ఖచ్చితంగా వేస్తుంటాం. ఎందుకంటే టమాటాలు వంటలను ఎంతో టేస్టీగా చేస్తాయి. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన జుట్టును బలంగా చేస్తాయి. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తాయి. 
 

57
Sweet potatoes

చిలగడదుంపలు

చిలగడదుంపల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన జుట్టుకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. చిలగడదుంపల్లో విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మీ డైట్ లో చేర్చడం వల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 
 

67

గుడ్లు

గుడ్లు పోషకాల బాంఢాగారం. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బయోటిన్, జింక్, అమైనో ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా జుట్టు పొడుగ్గా పెరిగేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా గుడ్లను తినడం వల్ల మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఊడటం కూడా తగ్గుతుంది. 
 

77

పాలు, పాల ఉత్పత్తులు

పాలు, పాల ఉత్పత్తులు కూడా విటమిన్ ఎ కు మూలం. వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. పాలను తాగినా, పాల ఉత్పత్తులను తీసుకున్నా ఎముకలు బలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు ఇవి మీ జుట్టు రాలకుండా చేస్తాయి. జుట్టును పొడుగ్గా పెంచేందుకు కూడా సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories