బొప్పాయి.. డయాబెటీస్ పేషెంట్లు తరచుగా బొప్పాయి పండును తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. పలు నివేదికల ప్రకారం.. బొప్పాయి శరీరంపై హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉటుంది. ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఆలాగే బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో తక్కువ కేలరీలు, విటమిన్ బి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.