మీ జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే వీటిని తినండి జుట్టు ఊడిపోయే అవకాశమే ఉండదు

Published : Apr 07, 2023, 01:45 PM IST

ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో పోషకాల లోపం ఒకటి. మనం తినే ఆహారం జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్ ను ఆపుతాయి. హెయిర్ ఫాల్ ఆగడానికి ఎలాంటి ఫుడ్ ను తినాలంటే.. 

PREV
15
మీ జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే వీటిని తినండి జుట్టు ఊడిపోయే అవకాశమే ఉండదు

ఆకుకూరలు

ఆకు కూరలు జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయని రుజువైంది. పాలకూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలకూరను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. రాలడం కూడా ఆగుతుంది. 

25
Image: Getty Images

క్యారెట్లు

క్యారెట్లలో విటమిన్ సి, విటమిన్  ఎ, ఫైబర్, పొటాషియం, కార్భోహైడ్రేట్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  క్యారెట్లను రోజూ తింటే కంటిచూపు మెరుగుపడటమే కాదు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ చాలా వరకు ఆగుతుంది. షైనీగా కూడా  కనిపిస్తుంది.
 

35

బాదం

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మెగ్నీషియం ఇతర పోషకాలకు అద్భుతమైన మూలం బాదం. బాదంలో విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమైన కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల జుట్టు రాలడం ఆగి బాగా పెరుగుతుంది.
 

45

గుడ్లు 

గుడ్లు ప్రోటీన్, బయోటిన్ కు అద్భుతమైన మూలం. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన రెండు పోషకాలు. కెరాటిన్ అని పిలువబడే జుట్టు ప్రోటీన్ ఉత్పత్తికి బయోటిన్ అవసరం. అందుకే జుట్టు పెరుగుదలకు బయోటిన్ సప్లిమెంట్స్ మార్కెట్ లో దొరుకుతాయి. బయోటిన్ లోపం ఉన్నవారిలో ఎక్కువ బయోటిన్ ను తీసుకోవడం వల్ల  జుట్టు పెరుగుదల మెరుగుపడుతుందని  పరిశోధనలో తేలింది.
 

 

55

బెర్రీలు

బెర్రీలలో ప్రయోజనకరమైన సమ్మేళనాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. బెర్రీల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.  బెర్రీలను తింటే  ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాదు జుట్టు కూడా బలంగా పెరుగుతుంది.

 

click me!

Recommended Stories