హిందూ వివాహాల్లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..!

Published : Apr 07, 2023, 11:47 AM ISTUpdated : Apr 07, 2023, 11:49 AM IST

ఇలా ధరించడానికి కారణం ఉంది. ఇలా ధరించడం వల్ల మహిళల చేతికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నమ్ముతారు. అందుకే... ఖచ్చితంగా గాజులు ధరిస్తారు.

PREV
110
 హిందూ వివాహాల్లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..!

హిందూ వివాహాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో  సంప్రదాయాల్లో వివాహాలు చేస్తూ ఉంటారు. అయితే... ఎన్ని సంప్రదాయాలు ఉన్నా.. కామన్ గా అందరూ కొన్నింటిని ఫాలో అవుతూ ఉంటారు. అవేంటి..? వాటి అర్థం ఏంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..

210

1.హిందూ పెళ్లిళ్లలో వధూవరులు చాలా రంగుల దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయితే... తెలుపు, నలుపు మాత్రం ధరించరు. అదేంటి..? తలంబ్రాల దుస్తులు తెలుపు రంగులోనే ఉంటాయి కదా అని మీరు అడగొచ్చు. తెలుపు రంగులోనేఉంటాయి కానీ.. దానిలో కూడా వేరే రంగులు కచ్చితంగా ఉంటాయి. వేరే ఎలాంటి రంగు లేకుండా.. అచ్చంగా తెలుపు దుస్తులు ధరించరు. ఇక... వారు ధరించే దుస్తుల్లో నలుపు ఒక్క గీత కూడా లేకుండా జాగ్రత్త పడతారు. కేవలం వధూవరులు మాత్రమే కాదు... పెళ్లి కి వచ్చిన అతిథులు కూడా ఇలా నలుపు, తెలుపు ధరించరు. ఇది శుభం కాదు అని భావిస్తారట.

310

2.ఇక పెళ్లి లో పెళ్లికూతురు చేతి నిండా గాజులు ధరిస్తుంది. పెళ్లికూతురు అనే కాదు.. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు గాజులు ధరిస్తూ ఉంటారు. ఇలా ధరించడానికి కారణం ఉంది. ఇలా ధరించడం వల్ల మహిళల చేతికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నమ్ముతారు. అందుకే... ఖచ్చితంగా గాజులు ధరిస్తారు.
 

410

3.పెళ్లిలో వధువు కాళ్లకు వెండి మెట్టలు పెడతారు. దీనికి కూడా కారణం ఉందట. మహిళల యూట్రస్ బలంగా మారడంతో పాటు.. శరీరానికి రక్త ప్రసరణ బాగా అందుతుంది. అదేవిధంగా మహిళలకు రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి ఉపయోగపడుతుందట. అందుకే కాళ్లకు మెట్టెలు పెడతారు.
 

510

4.పెళ్లిలో వధువు నుదిటి మీద  సింధూరం ధరిస్తూ ఉంటారు. దానికి కూడా కారణం ఉందట. ఇలా మహిళలు నుదుటిన కుంకుమ ధరించడం వల్ల వారిలో బీపీ కంట్రోల్ అవుతుందట. అదేవిధంగా వారిలో సెక్స్ డ్రైవ్ కూడా పెరగడానికి సహాయపడుతుందట.

610

5.పెళ్లిలో దంపతులతో బిందెలో ఉంగరాలు వేయించి ఆటలాడిస్తూ ఉంటారు. ఆ బిందెలో నీరు, పసుపు, కుంకుమ వేసి.. ఆ తర్వాత అందులో దంపతుల ఉంగరం, కాలి మెట్టలు వేస్తారు. ఇద్దరిలో ఎవరు ముందుగా ఉంగరం తీస్తారా అని పోటీ పెడతారు. అయితే... ఆ ఆటకు కూడా ఒక అర్థం ఉందట. ఎవరు ఉంగరం బయటకు ఎక్కువసార్లు తీస్తే.. వారిద్దరిలో డామినేషన్ వారిదే ఉంటుందని దాని అర్థమట.

710

6.కొంత మంది పెళ్లికూతురి చేతికి పదునైనా కత్తి కడతారట. దాని అర్థం... ఆమె వంక మరో పర పురుషుడి కన్ను పడకూడదని.. అలా పడితే తనను తాను రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో కత్తి కడతారట.
 

810
bride 1

7.ఒక పెళ్లి తర్వాత పెళ్లికొడుక్కి అత్తగారు హారతి ఇస్తారు. అనంతరం సరదాగా అల్లుడి ముక్కులాగుతారట. దానికి కూడా అర్థం ఉంటుందట. తమ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి...తమ వద్ద ఒద్దికగా, వినయంగా ఉండాలని అని చెప్పడం దాని  అర్థమట.

910
bride

8.కొన్ని పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు చెప్పులు దాచి పెడతారు. వాటిని వరుడి చెల్లెలు దాచి పెడుతుంది. వరుడు తన సోదరికి డబ్బులు ఇచ్చి... మళ్లీ తన చెప్పులు తాను తీసుకోవాలి.. 

1010

9.ఇక అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత బియ్యంతో ఉంచిన గిన్నెను కాలితో తన్నుతుంది. దాని అర్థం.. కొత్త కోడలు.. అత్తారింట్లో  సిరి, సంపదలు తెచ్చిపెట్టాలి అని అర్థమట.

click me!

Recommended Stories