Health Tips : మామిడి పండ్లను తినే ముందు 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టండి.. లేదనుకో.. ?

Published : May 06, 2022, 04:15 PM IST

Health Tips : మామిడి పండ్లను తినడం ముఖ్యం కాదు.. వాటిని ఎలా తినాలో తెలుసుండాలి. ఎందుకంటే ఈ పండును సరైన పద్దతిలో ఉంటేనే మామిడి పండులోని పోషకాలు మీ శరీరానికి అందుతాయి.   

PREV
17
Health Tips : మామిడి పండ్లను తినే ముందు 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టండి.. లేదనుకో.. ?

Health Tips : వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఈ పండ్లను బాగా లాగించేస్తుంటారు. మామిడి జ్యూస్, మిల్క్ షేక్ అంటూ వివిధ మార్గాల్లో మామిడిపండ్లను తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా మామిడి పండ్లను మార్కెట్లలో కొంటుంటాం. వాటిని కొనేయగానే తినేయాలనిపిస్తుంది కదూ. కానీ వీటిని అలా తినడం అస్సలు మంచిది కాదు. 
 

27
mango

వీటిని తినే ముందు మీరు సుమారుగా ఒక 30 నిమిషాలైనా నీటితో నానబెట్టాలి. వీటిని శుభ్రంగా కడగాలి. ఇది పురాతన కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. మన అమ్మమ్మ కాలం నుంచి కూడా పండ్లను నీళ్లలో నాన బెట్టే తినేవారు. 

37

మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో నానబెట్టడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒకటి కాదు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మార్కెట్లో తెచ్చిన పండ్లు మురికిగా ఉంటాయి. అలాగే వీటికి రసాయానాలను కూడా ఉపయోగిస్తారు. నానబెట్టడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి. మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్ఫుడు తెలుసుకుందాం. 

47
mango

ఫైటిక్ యాసిడ్ ను తగ్గిస్తుంది.. ఫైటిక్ యాసిడ్ కూడా ఒక రకమైన పోషకమే. ఇదిమన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. ఈ ఫైటిక్ యాసిడ్ ను యాంటీ ఆక్సిడెంట్ గా పరిగణిస్తారు. ఇది ఎక్కువగా ఉంటే కాల్షియం, జింక్, ఇనుము వంటి ఇతర ఖనిజాలు శోషించుకోకుండా శరీరాన్ని నిరోధిస్తుంది. దీంతో మీ శరీరంలో ఖనిజాల కొరత ఏర్పడుతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ మామిడి పండ్లలోనే కాదు ఇతర పండ్లు, కూరగాయల్లో కూడా ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అయితే మనం తినే మామిడి పండ్లను ఒక 30 నిమిషాల పాటు నీటిలో నానబెడితే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. 

57
mango

అన్ని కెమికల్స్ బయటకు పోతాయి.. మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడినికి, చీడపీడల నుంచి రక్షించడానికి వాటికి హానికరమైన పురుగుల మందులను ఉపయోగిస్తుంటారు. ఇవి మన శరీరంలోకి వెళ్లి విషపూరితంగా మారుతాయి. దీంతో మీరు అలెర్జీలు, చర్మం చికాకు పుట్టడం వంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మామిడి పండ్లను నీటిలో నానబెట్టకపోతే తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు అర్థగంట పాటు నీటిలో నానబెట్టి మంచిగా కడిగి తినాలి. 

67
mango

చర్మ సమస్యలు దూరమవుతాయి..  మామిడి పండ్లను తినాలని ఇష్టమున్నా.. తినని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వీటిని తింటే మొటిమలు, చర్మ సమస్యలు వస్తాయని. అయితే కొంతమంది మలబద్దకం, కడుపుకు సంబంధిచిన ఇతర శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. వీరు కూడా మామిడి పండ్లను తినరు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మాత్రం మామిడి పండ్లను ఖచ్చితంగా 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

77
mango

శరీర ఉష్ణోగ్రత పెరగదు.. మామిడి పండ్లను తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందనేది వాస్తవమే. అందుకే తినాలని ఇష్టమున్నా.. చాలా మంది తినరు. ఇలా బయటపడేవారు మామిడి పండ్లను అర్థగంట పాటు నీటిలో నానబెట్టి తినాలి. ఇలా తింటే శరీర ఉష్ణగ్రత తగ్గుతుంది. 

click me!

Recommended Stories