Girls Desires: అమ్మాయిలకు ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలంటేనే మస్తు ఇష్టం..

First Published | Feb 18, 2022, 12:55 PM IST

Girls Desires: ఒక అమ్మయిచే ప్రేమించబడాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే వారికి నచ్చుతారు? మన నుంచి వారు ఎలాంటివి కోరుకుంటారు?  అనే ప్రశ్నకు బహుషా ఎవరూ సమాధానం చెప్పలేరేమో...

Girls Desires: అమ్మాయిల మనసులో ఏముందో ఆ బ్రహ్మ దేవుడికి కూడా తెలియదు రా బాబూ అనేకునే వారు బొచ్చెడు మందే ఉన్నారు. అవును అమ్మాయిల మనస్సు సముద్రం లాంటిది. వారి నుంచి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. వారిని అర్థం చేసుకుంటే.. వారి ప్రేమలో మీరు మునిగిపోవడం పక్కాగా జరుగుతుంది. అయితే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో చాలా కన్ ఫ్యూజన్ అవుతుంటారు. వారికి ఎలా ఉంటే నచ్చుతారు? ఎలాంటి వారిని ప్రేమిస్తారు? వారు ప్రేమించే వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటూ తెగ ఆలోచిస్తుంటారు. ఇకపోతే అమ్మాయిలు ఏం భావిస్తున్నారో .. కనుక్కోవడం అంత తేలికైన విషయమైతే కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి సమాధానం లేని ప్రశ్నలే.
 

కానీ అమ్మాయిలు తాము ప్రేమించే అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉండాలని మాత్రం అనుకుంటారట. అవేంటో తెలుసుకుంటే వారిని ఈజీగా ప్రేమలో పడేయొచ్చు అంటున్నాయి కొన్ని సర్వేలు.. ఏమంటారు ..? మరి అబ్బాయిలు ఎలా ఉండాలి? వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అమ్మాయిలకు నచ్చుతుందో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. పదండి..


కేరింగ్ :  అబ్బాయిల నుంచి అమ్మాయిలు మొదటగా ఆశించేది, లేదా కోరుకునేది ఏదైనా ఉందా అంటే అది కేరింగ్ అనే చెప్పాలి. ప్రేమించిన అబ్బాయి తమ విషయంలో కేరింగ్ గా ఉండాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. వారికెదురయ్యే సమస్యల్లో పాలు పంచుకుని నీకు నేనున్నా.. అనే సమాధానం చెప్పే పర్సన్ రావాలనుకుంటారు. అన్నింటికంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా.. వీరి మధ్యన ఏదైన చిన్న గొడవ జరిగినా.. ముందుగా అబ్బాయిలే ఒక మెట్టు తగ్గాలని భావిస్తారట. ఎప్పుడైనా మీ లవర్ తో గొడవైతే.. ముందుగా మీరే క్షమాపనలు చెప్పండి. క్షణాల్లో అంతా సెట్ అయిపోద్ది.

పెర్ఫ్యూమ్‌:  అబ్బాయిలు వాడే పెర్ఫ్యూమ్ లంటే అమ్మాయిలకు తెగ ఇష్టమట. వారు స్ప్రే చేసుకునే పెర్ఫ్యూమ్  లపైనే అమ్మాయిలు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి మీరు మీ లవర్ తో డేట్ కు వెళ్లాలనుకునేటప్పుడు రొమాంటిక్ ఫీలింగ్ ను కలిగించే మంచి పెర్ఫ్యూమ్‌ ను స్ప్రే చేసుకుని వెళ్లండి. మరొక విషయం.. మంచి స్మెల్ నిచ్చే ఫెర్మూమ్ ను కొట్టుకునే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ ఇష్టమట.
 

స‌ర్ఫ్రైజ్ ను ఇష్ట‌ప‌డ‌తారు: అమ్మాయిలకు Surprises అంటే మహా ఇష్టం. అది చిన్నదా, పెద్దదా అని చూడకుండా ఆ మూమెంట్ ను వారు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంతగానో సంతోషిస్తారు. అందులో అమ్మాయిలకు చాక్లెట్ ను ఇవ్వడం, పువ్వులను ప్రజెంట్ చేయడం, ప్రేమను వ్యక్తపరచడం, బహుమతులను ఇష్టపడతారు. కాబట్టి మీకు ఇష్టమైన అమ్మాయిలకు ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తూ వారిని సంతోషపెట్టండి. అప్పుడే మీ లవ్ లైఫ్ హ్యాపీగా కొనసాగుతుంది. 
 

నిజాయితీ: ప్రేమలో అయినా.. పెళ్లిలో అయినా.. నిజాయితీ ఎంతో ముఖ్యం. ఒక రిలేషన్ షిప్ హ్యాపీగా కొనసాగాలంటే నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి. ఈ బంధంలో అబద్దాలకు చోటు ఉండకూడదు. అందులోనూ నిజాయితీగా ఉండే అబ్బాయిలంటేనే అమ్మాయిలకు ఇష్టం. వారు మీ నుంచి ఎప్పటికీ అబద్దాలను వినాలనుకోరు. నిజం చెప్పడం వల్ల ఆ సమయంలో చిన్న గొడవలు జరిగినా.. మీ ఫ్యూచర్ మాత్రం బావుంటుంది. అంతేకాదు వారికి మీపై గట్టి నమ్మకం ఏర్పడుతుంది. నాకెప్పుడూ అబద్దం చెప్పడని. 

పర్ఫెక్ట్ బాడీ:  అమ్మాయిలకు హీరోల మాదిరిగా తమ బాయ ఫ్రెండ్ కూడా సిక్స్ పాక్ తో చాలా స్టైలీష్ గా ఉండాలి ఆశపడుతుంటారు. అందులోనూ ఫిట్ గా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారు. కాబట్టి మీ వన్ సైడ్ లవ్ టూ సైడ్స్ కావాలన్నా.. మీ లవర్ మిమ్మల్ని మరింత ఇష్టపడాలన్నా.. ఇప్పటినుంచే మీరు వర్కౌట్స్ చేయడం ప్రారంభించండి. వీటివల్ల మీ లవర్ మిమ్మల్ని మెచ్చడం మెచ్చకపోవడం పక్కన పెడితే.. వీటితో మీరు ఆరోగ్యం ఉంటారు. 

Latest Videos

click me!