పెళ్లైన స్త్రీలు మెట్టెలు ధరించడం వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!

First Published | Feb 18, 2022, 10:04 AM IST

Hindu Women Wearing Toe Rin : హిందూ సాంప్రదాయంలో పెళ్లైన ప్రతి మహిళా మెడలో మంగళసూత్రం, నల్లపూసల దండ, కాళ్లకు మెట్టెలు, చేతులకు గాజులు, నుదిటిన బొట్టు ఖచ్చితంగా ఉంటాయి. వీటిని ఎందుకు ధరిస్తామంటే ఇది మనసాంప్రదాయమని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజానికి వీటిని ధరించడం వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. 

Hindu Women Wearing Toe Rin : హిందూ సాంప్రదాయం ప్రకారం.. పెళ్లైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా మెడలో తాళిబొట్టు, నల్లపూసల దండ, నుదిటిన కుంకుమ బొట్టు, కాళ్లకు మెట్టెలు, చేతులకు మట్టి గాజులను ధరిస్తారు. ఈ నియమాలు అనథికాలం నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ఆచారాలు కేవలం సాంప్రదాయంగానే కాకుండా సైంటిఫిక్ రీజనర్ కూడా ఉంది. ఇక కాళ్లకు ఎందుకు మెట్టెలు పెట్టుకోవాలని ఎవరైనా ప్రశ్నిస్తే   ‘ఆమె’ కు పెళ్లైందో లేదో తెలియడానికి అంటూ సమాధానం చెబుతూ ఉంటారు. వాస్తవానికి మెట్టెలు పెట్టుకునేది అందుకైతే కాదు. ఈ మెట్టెల వెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాల వెనక  సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ముక్కుపుడక, గాజులు , చెవులకు దిద్దులకు వెనకున్న సైంటిఫిక్ కారణాలు మనకు తెలిసిందే. మన ఆచారం అనకుంటూ పాటిస్తున్న ప్రతి దానివెనక మనకు మంచి చేసే కారణమే ఉంటుంది. కానీ హాని కలిగించేది ఏదీ లేదని సైన్స్ చెబుతోంది. మరి కాళ్లకు మెట్టెలను ధరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 
 

Latest Videos


మహిళల కాలి బొటనవేలు పక్కనున్న వేలికి, గర్భకోశంలోని నరాలకు సంబంధం ఉంటుంది. అయితే ఈ మెట్టెలను పెట్టుకోవడం వల్ల Pregnancy కి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదని కొంతమంది ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
 

మీకు తెలుసా.. మగవారిలో కంటే ఆడవారిలోనే కామవాంఛ ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని పలు సర్వేలు కూడా చెప్పాయి. కాగా మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆడవారిలో కామ కోరికలు నియంత్రణలో ఉంటాయని కొన్ని పురాతన గ్రంథాలు కూడా చెబుతున్నాయి. 
 

ఆల్టర్నేటివ్ మెడిసిన్ గ్రంథాల ప్రకారం.. మెట్టెలను పెట్టుకుంటే కొన్ని రకాల Skin diseases రావట. అంతేకాదు మెట్టెలను ధరించడం వల్ల ‘ఆమెకు పెళ్లి అయిపోయింది’ అనే సంకేతాన్ని కూడా తెలియజేస్తుంది. దీంతో పరపురుషుల వ్యామోహం నుంచి కూడా మహిళలను మెట్టెలు రక్షిస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

కాళ్లకు వెండి మెట్టెలను ధరించడం వల్ల మహిళలకు nature లో ఉండే  Positive Energy అందుతుందట. అందుకే వీటిని ధరించాలని పెద్దలు చెబుతుంటారు.
 

కాళ్లకు మెట్టెలను ధరించడం వల్ల గర్భాశయానికి బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా జరిగి, గర్బాశయం ధ్రుఢంగా మారుతుందట. అంతేకాదు వీటివల్ల నెలసరి కూడా క్రమంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బొటనవేలి పక్కనున్ను వేలికున్న ఓ నరం గర్భాశరాయినికి సంధిచేయబడి ఉంటుంది. అది హార్ట్ వరకు వెళుతుందని వైద్యులు చెబుతున్నారు. దానివల్లే ఇన్ని ప్రయోజనాలున్నాయి.

మీకు తెలుసా..  ఆడవారు ధరించే మెట్టెలు, గాజులు వారి సంతానాభివృద్ధికి ఎంతో సహకరిస్తాయి. వీటిని ధరించడం వల్ల మహిళలు ప్రసవం సాఫీగా అవడానికి అనుకూలించే Nerves ను  Gently press చేస్తూ ఉంటాయట. 

click me!