Cholesterol Diet: ప్రతి వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసు కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గిస్తుంది..

Published : Jun 09, 2022, 01:47 PM IST

Cholesterol Diet: ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కానీ ఒక మసాలా దినుసు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..  

PREV
16
Cholesterol Diet: ప్రతి వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసు కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గిస్తుంది..
cholesterol

Cholesterol Diet: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) పెరగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో (arteries) కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా అధిక రక్తపోటు (High blood pressure)సమస్య వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

26

అల్లం కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇది ప్రతి వంట గదిలో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. అల్లం కూరలను టేస్ట్ గా చేయడమే కాదు.. మన ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol)(LDL) ను  తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అల్లాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి. 

36
ginger

అల్లం నీరు (Ginger water): అల్లం నీళ్లను తాగడం వల్ల శరీరానికి దాని ఔషద గుణాలు అందుతుంది. ఇవి  కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం తిన్న తర్వాత సగం గ్లాస్ అల్లం నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎలా తయారుచేయాలంటే.. ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో అల్లం ముక్కను వేసి బాగా మరిగించుకోవాలి. అవి చల్లారిన తర్వాత వడబోసి తాగాలి. 

46

అల్లం-నిమ్మకాయ టీ (Ginger-lemon tea): అల్లంలో నిమ్మకాయను కలిపి తీసుకోవడం వల్ల కూడూ మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ను, మసాలా ఫుడ్స్ ను తింటుంటైతే.. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే అల్లం-నిమ్మకాయ ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. 
 

56

పచ్చి అల్లం: మీ ఆహారంలో ఆయిల్ లేదా మసాలా దినుసులను ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు తరచుగా పచ్చి అల్లాన్ని కొద్ది కొద్దిగా నమిలితే.. మీ ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొందరగా తగ్గుతుంది.
 

66

అల్లం పొడి (Ginger powder): కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అల్లం పొడిని ఉపయోగించడం చాలా సులువు. ఇందుకోసం మీరు అల్లం పొడిని నీళ్లలో లేదా ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. ఈ పొడిని పరిగడుపున లేదా ఏదైనా తిన్న తర్వాత గానీ తీసుకోవచ్చు. దీనివల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు. 
 

click me!

Recommended Stories