Ghee Vs Butter: నెయ్యి, బటర్ రెండింటికి తేడా ఏంటి? రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?

Published : Oct 27, 2026, 06:44 PM IST

Ghee Vs Butter: చాలా మంది తమ వంటల్లో బటర్ వాడుతూ ఉంటారు. నెయ్యి మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు బటర్ కీ, నెయ్యికి తేడా ఏంటి? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మంచిది?

PREV
13
నెయ్యి, బటర్ ఏది బెటర్?

ఒకప్పుడు నెయ్యి తింటే లావైపోతారు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చాలా మంది పూర్తిగా దూరం పెట్టేసేవారు. కానీ, ఇప్పుడు మళ్లీ అదే నెయ్యి ట్రెండ్ లోకి వచ్చింది. ప్రతిరోజూ ఒక స్పూన్ నెయ్యి అయినా తినాలి.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్ ఫుడ్ అని చెబుతున్నారు. అంతేకాదు.. నెయ్యితో పాటు బటర్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి ఎప్పుడూ వచ్చే సందేహం ఏంటంటే... రోజూ మనం వాడే బటర్ మంచిదా? లేక మన సాంప్రదాయంగా తయారు చేసుకునే నెయ్యి మంచిదా? ఈ రెండింటికీ ఉన్న తేడా ఏంటి?

23
నెయ్యికీ, బటర్ కీ తేడా ఎక్కడ ఉంది?

బటర్.. మనకు మార్కెట్లో దొరికే సాధారణ బటర్ అనేది పాలు లేదా మీగడలో నీరు, మిల్క్ ప్రోటీన్లు, ఉప్పు కలిపి తయారు చేస్తారు. ఇది ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన రూపంలో లభిస్తుంది.

నెయ్యి.. ఇక, నెయ్యి విషయానికి వస్తే.. వెన్న లేదా మీగడను మంటపై వేడి చేసి కరిగించడం ద్వారా తయారౌతుంది. ఈ ప్రాసెస్ లో నీటి శాతమంతా ఆవిరైపోయి, కేవలం స్వచ్ఛమైన కొవ్వు పదార్థం మాత్రమే మిగులుతుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు.

పోషకాలు, క్యాలరీల్లో తేడా...

100 గ్రాముల్లో బటర్ లో సుమారు 717 కేలరీలు ఉండగా, అదే 100 గ్రాముల నెయ్యిలో 900 కేలరీలు ఉంటాయి. నెయ్యిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బటర్ లో 3 గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటే... స్వచ్ఛమైన నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు. అంతేకాకుండా నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి.

33
ఆరోగ్యానికి ఏది మంచిది..?

పోషకాహార నిపుణుల ప్రకారం, మితంగా తీసుకుంటే నెయ్యి మన శరీరానికి చాలా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. నెయ్యి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మానికి మెరుపునివ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బటర్ లో ఉండే కొన్ని రకాల ప్రాసెస్డ్ పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ తో పోలిస్తే.. స్వచ్ఛమైన నెయ్యి శరీరానికి చాలా సులభంగా పడుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే, బటర్ తో పోలిస్తే.. నెయ్యి ని వంటల్లో తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు.

Read more Photos on
click me!

Recommended Stories