3. బేకింగ్ సోడాను డైరెక్ట్‌గా పూయవద్దు..
సాధారణంగా ఇల్లు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడతారు, కానీ స్విచ్‌బోర్డ్‌లకు దాని పేస్ట్‌ను నేరుగా పూయడం అసలు మంచిది కాదు. దీనివల్ల ప్లాస్టిక్ ఉపరితలంపై గీతలు పడటమే కాకుండా, తేమ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా పొడి క్లాత్ లేదా సబ్బు నీటితోనే ప్రయత్నించండి. మొండి మరకలు ఉంటే తయారీదారు సిఫార్సు చేసిన ప్రత్యేక క్లీనర్‌ను మాత్రమే వాడండి.
4.పసుపు రంగులోకి మారితే..
స్విచ్‌బోర్డ్ పసుపు రంగులోకి మారడానికి కేవలం మురికి మాత్రమే కారణం కాకపోవచ్చు. ప్లాస్టిక్ పాతబడటం, లోపలి వేడి లేదా సూర్యరశ్మి పడటం వల్ల కూడా ప్లాస్టిక్ రంగు మారుతుంది. ఇటువంటి సందర్భాల్లో సాధారణ శుభ్రత వల్ల అది మళ్లీ తెల్లగా మారకపోవచ్చు. దానికోసం కఠినమైన రసాయనాలు, బ్లీచ్ లేదా గట్టిగా రుద్దే స్క్రబ్బర్‌లను అస్సలు ఉపయోగించవద్దు. కలర్ పూర్తిగా మారిపోతే పాత స్విచ్‌బోర్డ్ ప్లేట్‌ను కొత్త దానితో మార్చడమే సరైన పరిష్కారం.
స్విచ్ బోర్డు కొత్తగా కనిపించాలంటే ఏం చేయాలి...
ప్రతి వారం పొడి క్లాత్ తో పైన ఉన్న దుమ్మును దులపడం వల్ల మురికి పేరుకుపోకుండా ఉంటుంది. స్విచ్‌బోర్డ్‌పై నేరుగా నీటిని లేదా క్లీనర్ లిక్విడ్‌ను ఎప్పుడూ స్ప్రే చేయకూడదు. పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు తడి గుడ్డను అసలు తాకించవద్దు.