Garikapati: గరికపాటి జీవన సూత్రం, ఇది పాటిస్తే మీ జీవితానికి తిరుగులేదు

Published : Mar 26, 2026, 06:39 PM IST

Garikapati: గరికపాటి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక విషయాలు చెప్తూనే జీవిత పాఠాలు బోధిస్తుంటారు. ఆయన చెప్పే ఈ జీవన సూత్రం పాటిస్తే మీ జీవితానికి తిరుగుండదు. 

PREV
17
గరికపాటి జీవనసూత్రాలు

ఈరోజుల్లో ప్రవచనాలు వినేవాళ్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒక మనిషిని గంటలపాటు కూర్చోపెట్టి ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్పడం సాధ్యమైన విషయం కాదు. కానీ ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకు మాత్రం మామూలు ఫాలోయింగ్ లేదు. చిన్న పిల్లవాడి నుంచి టీనేజ్ అబ్బాయిలు, ముసలివాళ్లు కూడా ఆయన్ను ఫాలో అవుతారు. ఆధ్యాత్మికత గురించి చెప్తూనే జీవిత పాఠాలు బోధిస్తుంటారు. తన అనర్గళమైన ప్రసంగాలతో, పాండిత్యంతో మెప్పిస్తుంటారు. రాముడి గురించి చెప్తారు, పోపు ఎలా వేసుకోవాలో చెప్తారు, దాంపత్యం గురించి వివరిస్తారు, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ గురించి చెప్తారు.

తన వాగ్ధాటితో కోట్లాది మందిని ఆలోచింపజేస్తుంటారు. ఆయన చెప్పే విషయాలు కేవలం పురాణ కాలక్షేపం మాత్రమే కాదు, నేటి ఆధునిక కాలంలో ఒత్తిడితో సతమతమవుతున్న వారికి ఒక చక్కని 'లైఫ్ గైడ్' అనే చెప్పుకోవాలి. ఆయన చెప్పే "లైఫ్ స్టైల్ టిప్స్" క్రమశిక్షణ, సమయ పాలన, మానసిక ప్రశాంతత చుట్టూరా తిరుగుతాయి. ఆయన చెప్పే జీవన సూత్రాల గురించి ఇక్కడ చూద్దాం. 

27
బ్రహ్మ ముహూర్తం

సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచేవాడు సగం విజయం సాధించినట్లే అని గరికపాటి గారు చెప్తారు. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మెదడు యాక్టివ్‍గా ఉంటుంది. ఆ సమయంలో చదివినా, ఏ పని చేసినా ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. సోమరితనాన్ని వదిలి సూర్యుడికంటే ముందే లేవడం అనేది క్రమశిక్షణకు పునాది. 

37
వాక్ శుద్ధి

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిని గాయపరచకూడదు. అవసరం లేని చోట మౌనంగా ఉండటం, అవసరమైన చోట అర్థవంతంగా మాట్లాడటం ఒక కళ. అనవసరమైన వాదనలు, విమర్శలు మనిషి శక్తిని హరిస్తాయి. సంస్కారవంతమైన భాష మనిషి వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.

47
ఆహార నియమం

నేటి కాలంలో రోగాలకు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు. గరికపాటి గారు చెప్పే సూత్రం ఏంటంటే ఆకలి వేసినప్పుడే తినాలి, రుచి కోసం కడుపునిండా తినకూడదు. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం మృత్యువును ఆహ్వానించడమే అని ఆయన హెచ్చరిస్తారు.

57
పుస్తక పఠనం

స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో పుస్తకాన్ని పక్కన పెట్టడం వల్ల మనిషి ఆలోచనా శక్తి తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రతిరోజూ కనీసం అర గంట ఏదైనా మంచి పుస్తకం చదవాలని గరికపాటి గారు చెప్తారు. ఇది మానసిక వికాసానికి తోడ్పడుతుంది. 

67
సంపాదన

సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ సంపాదన పది మందిని మోసం చేసి వచ్చినది కాకూడదని గరికపాటి సూత్రం. అడ్డదారిలో వచ్చే డబ్బు తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చినా, శాశ్వతమైన అశాంతిని మిగులుస్తుంది. కష్టపడి సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి కోట్లు ఇచ్చినా రాదు.

77
కుటుంబ వ్యవస్థ

తల్లిదండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థం. పిల్లలకు చిన్నతనం నుండే ధర్మం, సంస్కారం నేర్పించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పెద్దల పట్ల విధేయత కలిగి ఉండటం అనేది ఒక గొప్ప జీవన సూత్రం.

Read more Photos on
click me!

Recommended Stories