Gardening Tips: ఇంట్లో మొక్కలు పెంచడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే మొక్కలు పెట్టాలంటే విత్తనాలు, నారు అవసరం. కానీ ఆకులతో కూడా కొత్త మొక్కను పెంచవచ్చనే విషయం మీకు తెలుసా? అవును ఈ మొక్కల ఆకులతో కొత్త మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే మొక్కల ఆకులు రాలిపోతే, వాటిని బయట పడేస్తుంటాం. కానీ కొన్ని ఇండోర్ మొక్కల ఆకులు కూడా కొత్త మొక్కకు జీవం పోయగలవు. ప్రస్తుతం ఆకులతో మొక్కలు పెంచే ట్రెండ్ బాగా పెరిగింది. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో మంచి ఫలితాలు వస్తుండటంతో చాలామంది దీన్ని ట్రై చేస్తున్నారు. దీనికోసం ఖరీదైన పరికరాలు అవసరం లేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆకు, కొంచెం మంచి నీళ్లు, కాస్త ఓపిక ఉంటే చాలు. అలా ఒక్క ఆకుతో పెంచగల ఇండోర్ మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
ఆఫ్రికన్ వయోలెట్
మీరు మొక్కలు పెంచడం కొత్తగా ప్రారంభిస్తుంటే, ఆఫ్రికన్ వయోలెట్ చాలా మంచి ఆప్షన్. దీని ఆరోగ్యకరమైన ఆకును తీసుకొని, దాని కాడను సుమారు 1 సెంటీమీటర్ వరకు నీటిలో ముంచి ఉంచాలి. దాదాపు 4 నుంచి 6 వారాల్లో, ఆకు కింద నుంచి చిన్న కొత్త మొక్కలు రావడం మొదలవుతుంది. ఈ మొక్క తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. అందుకే అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
36
బెగోనియా రెక్స్
బెగోనియా రెక్స్ ఒక అందమైన మొక్క. దీని ప్రత్యేకత దాని ఆకుల్లో దాగి ఉంటుంది. ఈ మొక్క నుంచి ఆరోగ్యకరమైన ఆకును తీసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని తేమగా ఉన్న మట్టిలో లేదా కొద్దిపాటి నీటిలో ఉంచాలి. సుమారు 6 నుంచి 8 వారాల్లో, ఆకు నుంచి కొత్త మొక్కలు రావడం మొదలవుతుంది. వాటిని వేరే కుండీల్లో పెంచుకోవచ్చు.
స్నేక్ ప్లాంట్ ని చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఇది ఇంటిలోని గాలిని శుద్ధి చేసే మొక్కగా బాగా పాపులర్ అయింది. దీని పొడవాటి ఆకులను 7 నుంచి 8 సెంటీమీటర్ల ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కల కింది భాగాన్ని నీటిలో ఉంచాలి. సుమారు రెండు నెలల్లో వాటికి కొత్త వేర్లు వస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా కొత్త మొక్కను తీసి వేరే కుండీలో పెంచుకోవచ్చు.
56
పెపరోమియా
పెపరోమియా మొక్కను దాని మెరిసే ఆకులు, కాంపాక్ట్ సైజ్ కారణంగా చాలామంది ఇష్టపడతారు. దీని ఆకును చిన్న కాడతో సహా నీటిలో ఉంచాలి. సుమారు 4 నుంచి 6 వారాల్లో, ఆకు కింద భాగంలో కొత్త మొక్క ఏర్పడటం మొదలవుతుంది. తక్కువ స్థలంలో గార్డెనింగ్ చేసేవారికి ఈ మొక్క అద్భుతమైన ఎంపిక.
66
జెడ్ ప్లాంట్
జెడ్ ప్లాంట్ ఆకుతో కొత్త మొక్కను సులభంగా పెంచవచ్చు. జెడ్ ప్లాంట్ ఒక సక్యూలెంట్ మొక్క కాబట్టి దాని ఆకు నుంచి వేర్లు ఈజీగా వచ్చి కొత్త మొక్కలు వృద్ధి చెందుతాయి. ఈ మొక్కను చాలా తక్కువ శ్రద్ధతో సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. మొదట జెడ్ ప్లాంట్ నుంచి మంచి ఆకును ఎంపిక చేసుకొని దాన్ని 2-3 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆకును చాలా తక్కువ లోతులో మట్టిలో నాటాలి. సుమారు 4 వారాల్లో ఆకు నుంచి కొత్త మొక్కలు రావడం మొదలవుతుంది. ఆ చిన్న మొక్కను వేరే కుండీలోకి మార్చుకోవచ్చు.