Friendship Day 2023: మీ ఫ్రెండ్ ఆరోగ్యాన్నే మీరు కోరుకుంటే.. ఈ ఫ్రెండ్ షిప్ డే రోజు ఈ గిఫ్ట్ లు ఇవ్వండి

Published : Aug 06, 2023, 10:48 AM IST

Friendship Day 2023: కష్టాలెన్ని ఎదురైనా మనకు అన్ని వేళలా తోడుగా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. జీవితంలో ఎన్నో విషయాలను మర్చిపోవచ్చు. కానీ దోస్తులతో గడిపిన ప్రతి మూమెంట్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అందుకే ఫ్రెండ్స్ ను ఎప్పటికీ మర్చిపోలేం అంటారు. అసలు ఫ్రెండ్ ను ఎవ్వరితో పోల్చలేం. ఫ్రెండ్ అద్బుతమంతే.    

PREV
18
Friendship Day 2023: మీ ఫ్రెండ్ ఆరోగ్యాన్నే మీరు కోరుకుంటే.. ఈ ఫ్రెండ్ షిప్ డే రోజు ఈ గిఫ్ట్ లు ఇవ్వండి

స్నేహమనేది మన హృదయంతో నేరుగా ముడిపడి ఉన్న విలువైన సంబంధం. స్నేహం కేవలం సరదాకే పరిమితం కాదు.. స్నేహితుడు మనకు రక్షకుడిగా, రహస్య సంరక్షకుడిగా, అవసరమైనప్పుడు కేర్ టేకర్ గా కూడా మారుతాడు. జీవితంలో మంచి స్నేహితులు ఉన్నవారే గొప్పవారవుతారని పరిశోధనలో తేలింది. కష్టాలెన్ని ఎదురైనా స్నేహితుడు మాత్రం మన స్నేహాన్ని విడువడు. మనల్ని వదిలేయడు. అదే  మనల్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. దీంతోనే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాం.

28

కాబట్టి ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు ఆరోగ్య కానుక ఇస్తూ వారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పకూడదు. మీ స్నేహితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికోసం మీరు కొన్ని ఆరోగ్యకరమైన బహుమతులను ఇవ్వొచ్చు. ఇందుకోసం ఏం ఇవ్వాలని ఆలోచించక్కర్లేదు.. మీ ఫ్రెండ్ కు ఇవ్వాల్సిన కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

38

ఫ్రెండ్ షిప్ డే 2023

ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు.. ఈ రోజు వారి వారి స్నేహితులకు బహుమతులు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కొంటుంటారు. చాలా మంది తమ భావాలను కార్డుల ద్వారా వ్యక్తపరుస్తారు. 

48

మిశ్రమ విత్తనాల జార్

మిశ్రమ విత్తనాల జార్ ను తయారు చేయడం చాలా సులభం. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు మొదలైన వాటిని కొంచెం ఉప్పు వేసి వేయించండి. తర్వాత ఒక జార్ లో పోసి ప్యాక్ చేయండి. ఒక టీస్పూన్ మిక్స్ డ్ సీడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.  విత్తనాలలో తగినంత మొత్తంలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు. మిశ్రమ విత్తనాలలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. అందువల్ల ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నార్మల్ గా ఉంచుతుంది. అంతేకాదు ఇది శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుతంది. అలాగే శరీర బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ విత్తనాలన్నీ ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరులు. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచచిి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడతాయి.
 

58

నట్స్ మిక్స్ జార్

డ్రై ఫ్రూట్స్ లో  ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎన్నో వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం కూడా చేస్తాయి. అంతే కాదు డ్రై ఫ్రూట్స్ లో తగినంత మొత్తంలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్, కాల్షియం వంటి ఇతర ముఖ్యమైన సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిరాశ, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు ఎవరికైనా హిమోగ్లోబిన్ లోపం ఉంటే ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ కె, మెగ్నీషియం కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరంలో రక్తాన్ని పెంచుతాయి. 

68


హోం మేడ్ స్కిన్ కేర్ హ్యాక్స్

మీ ఫ్రెండ్ కు మొటిమలు వంటి చర్మ సమస్యలు ఉండి వివిధ రకాల రసాయనాలను ఉండే ఉత్పత్తులను ప్రయత్నిస్తూ ఉంటే.. మీరు వారికి ఇంట్లోనే తయారుచేసిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇందుకోసం దోసకాయ, గ్రీన్ టీ, రైస్ వాటర్ వంటి వాటితో ఇంట్లోనే స్కిన్ టోనర్ తయారు చేసుకోవచ్చు. అలాగే కాయధాన్యాలు, ముల్తానీ మిట్టి, బియ్యప్పిండి మొదలైన వాటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ పౌడర్, స్కిన్ స్క్రబ్ ను  కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. అలాగే మీ గిఫ్ట్ హ్యాంపర్ లో హెయిర్ కేర్ చిట్కాలను కూడా చేర్చండి. ఇందుకోసం కాఫీ బ్రౌన్ షుగర్ వంటి వాటిని మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లు, స్కాల్ప్ స్క్రబ్స్ ను పౌడర్ రూపంలో తయారు చేసుకోవచ్చు. 
 

78

మెన్స్ట్రువల్ కప్ లు, టాంపోన్లు

మీ స్నేహితురాల్లలో ఎవరైనా ఇంకా మెన్స్ట్రువల్ కప్పులు లేదా టాంపోన్లను ఉపయోగించకపోతే ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీరు వారికి టాంపోన్లు లేదా మెన్స్ట్రువల్ కప్పులను బహుమతిగా ఇవ్వొచ్చు. అలాగే వాటిని ఉపయోగించే మీ అనుభవాన్ని హ్యాండ్మేడ్ కార్డు ద్వారా కూడా ఇవ్వొచ్చు. ప్యాడ్లతో పోలిస్తే వీటి వాడకం చాలా సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. 
 

88


డార్క్ చాక్లెట్

ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు ఏదైనా తీయని బహుమతి ఇవ్వాలనుకుంటే చక్కెర చాక్లెట్ కు బదులుగా కోకో ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ ను బహుమతిగా ఇవ్వండి. 70 నుంచి 85% కోకో కలిగిన డార్క్ చాక్లెట్ నే కొనండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్ లో ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును నియంత్రించేటప్పుడు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

click me!

Recommended Stories