Cooking Recipes: ఈవెనింగ్ స్నాక్స్ గా ఫ్రైడ్ చికెన్ వాన్ టన్.. ఎలా తయారు చేయాలంటే?

Published : Jun 29, 2023, 12:27 PM IST

Cooking Recipes: నాన్ వెజ్ ప్రియులు చికెన్ చాలా వెరైటీల్లో టేస్ట్ చేసి ఉంటారు. ఈసారి ఫ్రైడ్   చికెన్ వాన్ టన్ స్నాక్ ట్రై చేద్దామా.. రండి ఎలా చేయాలో చూద్దాం తర్వాత తిందాం.  

PREV
16
Cooking Recipes: ఈవెనింగ్ స్నాక్స్ గా ఫ్రైడ్ చికెన్ వాన్ టన్.. ఎలా తయారు చేయాలంటే?

చికెన్ వాన్ టన్ రెసిపీ చేయటానికి చాలా ఓపిక కావాలి. రుచులు కావాలి అంటే ఓపిక ఉండాలి కదా మరి అందుకే కాస్త ఓపికతో ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. సాయంత్రం టైంలో వేడివేడిగా ఏదైనా చికెన్ స్నాక్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఐటెం.
 

26

ఈ స్నాక్ ని ఫ్రై చేయవచ్చు లేదా ఆవిరిలో ఉడికించి తినవచ్చు. ఏ విధంగా చేసినా రుచి మాత్రం అద్భుతంగా ఉండి తీరుతుంది. దీనికి కావలసిన పదార్థాలు చికెన్ 500 గ్రాములు ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, క్యారెట్ తురుము ఒక కప్పు.  
 

36

 మొక్కజొన్న పిండి రెండు టీ స్పూన్లు, సోయాసాస్ ఒక టేబుల్ స్పూన్, అల్లం ఒక టేబుల్ స్పూన్ తురుముకొని ఉంచుకోవాలి. వాటర్ చెస్ట్ నట్స్ ఒక పావు కప్పు తీసుకొని పొడి చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల వెన్న, రెండు టేబుల్ స్పూన్ల కరోనా ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ స్వీట్ అండ్ సోర్ సాస్.
 

46

ఉప్పు రుచికి సరిపడా, నూనె ఫ్రై చేయడానికి సరిపడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చికెన్, క్యారెట్ తురుము మరియు వాటర్ చెస్ట్ నట్స్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. మరో చిన్న గిన్నెలో మొక్కజొన్న పిండి నీళ్లు సోయాసాస్, అల్లం వేసి కలుపుకొని దోశ పిండి లాగా చేసుకోవాలి.
 

56

 ఇప్పుడు అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వాంటెడ్ పేపర్ కు కింద డంప్ పేపర్ టవల్ చుట్టుకోవాలి. మీరు అన్ని సిద్ధం చేసుకున్నాక దీన్ని ఉపయోగించాలి. ఇప్పుడు కవర్ మధ్యలో ఒక స్పూన్ చికెన్ మిశ్రమంతో ఫిల్ చేయాలి.
 

66

తర్వాత మీ చేతి వేళ్ళని ఉపయోగించి రేపర్ సైడ్స్ మడత పెట్టాలి. ఇలా అన్ని తయారు చేసుకున్నాక బట్టర్ మరియు నూనె రెండింటి మిశ్రమాన్ని చికెన్ వాంటెన్స్ కి అప్లై చేయాలి. వీటిని పది నుంచి 12 నిమిషాలు సేపు ఫ్రై చేసుకుని గార్లిక్ సాస్ తో కానీ టమాటా సాస్ తో కానీ తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం.

click me!

Recommended Stories