జ్ఞాపకశక్తిని పరుగులు పెట్టించే ఆహారపదార్థాలివే..

First Published | Feb 10, 2021, 12:08 PM IST

పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం మెదడును చురుకుగా ఉంచి శరీరానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఇదొక్కటే కాదు చక్కటి పోషకాహారం మన రోజువారీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.

పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం మెదడును చురుకుగా ఉంచి శరీరానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఇదొక్కటే కాదు చక్కటి పోషకాహారం మన రోజువారీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.
మెదడును ఉత్తేజితం చేసే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. మెదడు కణాల్ని యాక్టివేట్ చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తాయి.

ఫ్యాటీ ఫిష్ : కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డైన్, ట్రూట్ లాంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలాన్ని ఉత్తేజితం చేసి, నరాలమీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. తద్వారా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది.
బ్రొక్కోలి : విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థం బ్రొక్కోలి. అంతేకాదు అత్యధిక పోషకవిలువలు కలిగిన ఆహారపదార్థం కూడా బ్రొక్కొలినే. ఇది జ్ఞాపకశక్తికి పెంచడంలో బాగా పనిచేస్తుంది.
గుమ్మడికాయ విత్తనాలు : శరీరాన్ని, మెదడును ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శక్తివంతమైన పోషకాహారంగా దీన్ని చెప్పుకోవచ్చు.
నట్స్ : కాజు, పిస్తా, బాదాంలాంటి నట్స్ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు చురుకుదనం పెరగడమే కాదు గుండె ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
కోడిగుడ్లు : విటమిన్ బి6, బి12, కోలైన్, ఫొలేట్ లు అధికంగా ఉండే పోషకాహారం కోడిగుడ్లు. కోలైన్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు కణాలు ఉత్తేజితం అవుతాయని, ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది.
ఆరెంజ్ : విటమిన్ సి అధికంగా ఉండే ఆహారపదార్థంగా మాత్రమే మనకు తెలిసి ఆరెంజ్ తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మెదడు కణాలు చురుకుగా ఉండడానికి కావాల్సిన ఉత్తేజం కూడా ఆరెంజ్ లోని విటమిన్ సి ఇస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయి.
బ్లూ బెర్రీలు : యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బ్లూ బెర్రీలో అధికంగా ఉంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడులోని నొప్పి, చికాకు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ ఏజింగ్, నరాల సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Latest Videos

click me!