భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు పడకగదిలో ముగుస్తాయని ఎప్పటినుండో వాడుకలో ఉన్న మాట. అయితే పడకగదిలో శృంగారమే అన్ని సమస్యలకూ సమాధానం కాదు. మారుతున్న కాలం జంటల మధ్య అనేక మార్పులు తీసుకువచ్చింది. సమస్యలు పరిష్కరించుకోవడానికి పడకగదే మొదటి ప్రయారిటీ అనేది పాత మాట.
మనుషులు ఎన్నిరకాలో అన్ని రకాల వ్యక్తిత్వాలుంటాయి. వారి వారి వ్యక్తిత్వాలను బట్టి వారి వారి బంధాలు, అనుబంధాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని ఆత్మీయంగా అనిపిస్తాయి.
ఇంకొన్ని బైటికి కనిపించకుండా సున్నితమైన భావనను కలిగిస్తుంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య ఉండే ఈ అనుబంధం వారి శృంగార జీవితాన్ని మరింత బలోపేతం చేసి.. సంసారాన్ని మరింత సుఖవంతంగా తయారు చేస్తుంది.
ఒకరిమీద ఒకరికుండే అలాంటి మాటల్లో చెప్పలేని ఆత్మ బంధం వారి మధ్య ఆరోగ్యకరమైన బంధానికి దారి తీస్తుంది. ఇది మీ రిలేషన్ ను హ్యాపీగా మార్చేస్తుంది. అలాంటి వారిలో మీ జంటా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ లక్షణాలున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
సొంత గుర్తింపు : వివాహం, సహజీవనం ఆ బంధం ఏదైనా కానీయండి.. చాలామంది మెల్లిగా ఒకరి మీద ఒకరు ఆధారపడుతుంటారు. ఇది వారివారి ఇష్టాలు, అభిరుచులు, పరిస్థితుల మేరకు ఈ ఆధారపడే విషయాలు ఉంటాయి. అంతేకాదు తన జీవిత భాగస్వామికి నచ్చే విధంగా మారడానికి ప్రయత్నిస్తారు.
దీనికోసం తమను తాము ఎదుటివారికి తగ్గట్టుగా మార్చుకుంటారు. అంతేకాదు ఈ డిపెండెన్సీ అనేది రాను రాను పెరిగిపోయి వారి బంధం ఇబ్బందుల్లో పడుతుంది. అలా కాకుండా సొంతగా ఆలోచించడం, మీకంటూ ఉన్న ఓ వ్యక్తిత్వం, ఉనికిని కాపాడుకుంటూ ఉండడం ఇద్దరి మధ్య మంచి అనుబంధానికి, సంతోషకరమైన బంధానికి దారి తీస్తుంది.
బలహీనతలు చెప్పకపోవడం : చాలామంది తమలోని అభద్రతను, బలహీనతల్ని ఎదుటి వారికి తెలియడం ఇష్టపడరు. ఇలాంటి వారు బైటికి చెప్పలేక చాలా విషయాలను గుండె గదిలోనే బంధిస్తారు.
అంతేకాదు అలాంటి విషయాలు తెలియడం వల్ల తమను తప్పుగా అర్థం చేసుకుంటారనే అపోహలో జీవితకాలం ఇబ్బందిగానే గడుపుతారు. అలా కాకుండా ఎలాంటి శషభిషలు లేకుండా తమ మనసులోని విషయాలన్నీ పంచుకోగలిగిన జంటల మధ్య నమ్మకమైన బంధానికి పునాది పడుతుంది.
మీ అనుబంధంలో అనిశ్చితికి తావు ఇవ్వకండి.. మీ మధ్య దూరం పెరగకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. అన్ని రకాల విషయాలూ ఒకరితో మరొకరు పంచుకోవడం అనేది మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ఆ విషయం వల్ల మీద మధ్య గొడవలకు ఆస్కారం ఉన్నా కూడా అది చర్చించి పరిష్కరించుకోవాలి కానీ దాచకూడదు.
మీ అనుబంధంలో అనిశ్చితికి తావు ఇవ్వకండి.. మీ మధ్య దూరం పెరగకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. అన్ని రకాల విషయాలూ ఒకరితో మరొకరు పంచుకోవడం అనేది మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోవాలి. ఆ విషయం వల్ల మీద మధ్య గొడవలకు ఆస్కారం ఉన్నా కూడా అది చర్చించి పరిష్కరించుకోవాలి కానీ దాచకూడదు.
మీ భాగస్వామికి ఇబ్బంది కలిగించే అలాంటి విషయాలు మరోసారి జరగకుండా చూసుకోవాలి. ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమో తెలుసుకుని మసులు కోవడం ముఖ్యం.
వారి ఆలోచనలకు విలువ ఇవ్వడం, వారి అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం. మీ అభిప్రాయాలూ, ఆలోచనలు, ఆచరణలు అన్నీ దానికి సంబంధించే జరగడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.
మీ భాగస్వామికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇది చాలా బరువుగా అనిపించినా.. మీ సంతోషకరమైన, విజయవంతమైన బంధానికి ఇది చాలా ముఖ్యం. ఎదుటి వ్యక్తిని ప్రేమించే వాళ్లు తమ భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సమయాన్న ఎలాగో చేసుకుంటారు. ఇలా చేయడం అనేది వారికి మీరిచ్చే గౌరవం, ప్రాముఖ్యత అనే కాదు.. మీ బంధాన్ని సజీవంగా ఉంచడానికి మీ ప్రయత్నం కూడా.
ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ చేసిన బాసలు మరిచిపోరు.. అలా మరిచిపోతే తమ బంధం ఎక్కడ బలహీనపడుతుందో అని భయపడతారు.
శృంగారమే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. ఇటీవలి కాలంలో జంటల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా దానికి శృంగారంతో చెక్ పెట్టొచ్చు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సమస్యను తీర్చడానికి సెక్స్ ను మొదటి సమాధానంగా చూడడం కరెక్ట్ కాదు.
హ్యాపీ కపుల్ కూర్చుని, మాట్లాడుకుంటారు. సమస్య మీద చర్చించుకుంటారు. దాంతో పరిష్కరించుకుంటారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విబేధాలు, అపోహలు తొలగడానికి పారదర్శకత, కమ్యూనికేషన్ అనేది ముఖ్యమని వారు తెలుసుకుంటారు. సమస్యల పరిష్కారానికి సెక్స్ ఒక్కటే మార్గం కాదనే వాస్తవం వీరికి అర్థమవుతుంది.