Knee Pain: మోకాళ్ల నొప్పులున్న వారు ఏం తినాలి?

Published : May 13, 2022, 12:36 PM IST

Knee Pain: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వ సాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 60, 70 ఏండ్ల వారికే ఈ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 ఏండ్లు దాటిన యువకులు సైతం మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. 

PREV
17
Knee Pain: మోకాళ్ల నొప్పులున్న వారు ఏం తినాలి?

Knee Pain: వయసు మీద పడ్డాక రావాల్సిన రోగాలన్నీ వయసులో ఉన్నప్పుడే అటాక్ చేస్తున్నాయి. అందులో మోకాళ్ల నొప్పులు ఒకటి. ఈ మోకాళ్ల నొప్పులు ఒకప్పుడు 70, 80 లోపు ఉన్నవారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏండ్లు దాటితే చాలు ఈ నొప్పుల బారిన పడాల్సి వస్తుంది. 

27

దీనికి అసలు కారణం బయటి ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు లేని ఆహారాలను తినడం, వారి లైఫ్ స్టైల్ వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మోకాళ్ల నొప్పులున్న వారు కొన్ని రకాల ఆహార పదర్థాలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

37

నానబెట్టిన వాల్ నట్స్.. నానబెట్టిన వాల్ నట్స్ ను తినడం వల్ల కూడా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు సుమారుగా రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేస్తాయి. 

47

వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లిని పాలను కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక వారం రోజుకు ఈ చిట్కాలను పాటిస్తే చక్కటి ఫలితాన్ని చూస్తారు. 
 

57

బాదం పప్పులు.. కీళ్ల నొప్పులను తగ్గించడానికి విటమిన్ ఇ ఎంతగానో సహాయపడుతుంది. కాగా బాదం పప్పులు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి తోడ్పడుతాయి. ఈ పప్పుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 
 

67

బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 

77

బ్రోకలి.. బ్రోకలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి కూడా మోకాళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 

click me!

Recommended Stories