బీపీని తగ్గించే ఆహార పదార్ధాలు ఇవే..

Published : Mar 22, 2022, 11:29 AM IST

మారిన జీవన శైలి, కలుషిత వాతావరణం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల హై బీపీ సమస్య వస్తుంటుంది. ఈ ప్రాబ్లమ్ ను తగ్గించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయి.   

PREV
17
బీపీని తగ్గించే ఆహార పదార్ధాలు ఇవే..

దానిమ్మ.. దానిమ్మ పండులో బయోయాక్టివ్, ఫాలీఫినోల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. 

27

బీట్ రూట్.. బీట్ రూట్ లో ఎన్నో పోషకవిలువలుంటాయి. ఇందులో సహజ నైట్రేట్స్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి. దాంతో హైబీపీ నియంత్రణలో ఉంటుంది. 
 

37

వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే అలిసిన్ అధిక రక్తపోటును ఇట్టే నియంత్రణలోకి తెస్తుంది. బీపీ సమస్యతో బాధపడేవారు తమ రోజు వారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం మర్చిపోకూడదు. 
 

47

డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ తో ఎన్నో లాభాలున్నాయి. వీటిని తరచుగా తింటే మూడ్ ఇట్టే మారిపోతుంది. అంతేకాదు ఇందులో బీపీని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి బీపీ పేషెంట్లు డార్క్ చాక్లెట్లను తరచుగా తినండి. 

57

యాపిల్..  యాపిల్ పండ్లు పీబీ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్లేవనాయిడ్స్ అధిక రక్తపోటును తగ్గించడంలో ముందుంటాయి. కాబట్టి వీరు రోజుకో యాపిల్ ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

67

కూరగాయలు.. ఆకు కూరగాయలు, గింజలు, కూరగాయలను బీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో బీపీ ఇట్టే తగ్గిపోతుంది. 

77

ఆరెంజ్.. ఆరెంజ్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని తినడం వల్ల Blood circulation సాఫీగా అవుతుంది. అంతేకాదు ఈ సిట్రస్ ఫ్రూట్ హైబీపీని కూడా తగ్గిస్తుంది.       

Read more Photos on
click me!

Recommended Stories