ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, రోజంతా డెస్క్ పైనే కూర్చోవడం, శరీరాన్ని తక్కువగా కదిలించడం వంటి కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది. ప్రస్తుత కాలంలో ఈ నొప్పి సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఈ నొప్పి వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.