Beauty Tips: చాలా మందికి శరీరమంత ఒక కలర్ ఉంటే మెడ మాత్రం మరో కలర్ ఉంటుంది. ఒక్క మెడపై మాత్రమే నల్లగా ఉంటుంది. ఈ నులుపు సమస్యను కొన్నిచిట్కాలతో ఈజీగా తొలగించుకోవచ్చు..
Beauty Tips: కొంతమంది శరీరమంతా తెల్లగా ఉంటే.. వారి మెడ మాత్రం నల్లగా ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. మెడను సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కూడా మెడ నల్లగా తయారవుతుంది. కేవలం స్నానం చేసినప్పుడే కాదు ఇతర సమయాల్లో కూడా మెడను క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మెడ భాగాన్ని తెల్లగా మార్చేయొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి..
26
ఒక బౌల్ తీసుకుని అందులో టీ స్పూన్ చొప్పున కొబ్బరి నూనె, నిమ్మరసం, కాఫీ పొడి, పంచదార, ఈనోపొడిని వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను నల్లగా మారిన మెడభాగానికి రాసి ఒక పది పదిహేను నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి.
36
neck
ఆ తర్వాత కాసిన్ని గోరువెచ్చని నీళ్లతో మెడను శుభ్రం చేయాలి. ఈ చిట్కాను వారానికి రెండు మూడు సార్లు చేస్తే.. కర్రెగా మారిన మెడ మీ శరీరరంగులోకి మారుతుంది.
46
మెడకే కాదు నల్లగా ఉండే మోకాళ్లు, మోచేతులకు కూడా ఈ పేస్ట్ ను పెట్టి మర్దన చేస్తే కూడా నలుపు సమస్య వదిలిపోతుంది.
56
ఇకపోతే కొందరు తరచుగా బయట తిరగాల్సి వస్తుంటుంది. దాంతో వారి ముఖానికి మురికి పేరుకుపోతుంది. ఆ మురికిని పోగొట్టాలంటే.. కాస్త మజ్జిగ లేదా పాలు, లేదా పాల మీగడ, లేదా పెరుగులో ఏదో ఒకటి తీసుకుని ముఖనానికి పది పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి. ఈ పదార్థాలు ముఖానికి నేచురల్ క్లెన్సర్స్ గా ఉపయోగపడతాయి.
66
ముఖాన్ని ఎంత కడిగినా కొన్ని సందర్భాల్లో దుమ్ము కణాలు స్కిన్ లోపలికి వెల్లపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ముఖానికి మిల్క్ ప్రొడక్స్ ను ఉపయోగించండి. వీటితో మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.