లో బ్లడ్ షుగర్ కి ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి..

First Published Jul 21, 2021, 12:38 PM IST

సడెన్ గా రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోతే ఏం చేయాలి. వెంటనే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరల్ని నిర్థారిత స్థాయిల్లో మెయింటేన్ చేయచ్చు. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే....

డయాబెటిస్ ఉన్నవారికే కాదు లేనివారిలోనూ తరచుగా షుగర్ లెవల్స్ లో తేడాలు కనిపిస్తుంటాయి. దీనికి నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. మధుమేహం ఉన్నవారు వెంటనే తమకు ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలుగుతారు.
undefined
కానీ సడెన్ గా రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోతే ఏం చేయాలి. వెంటనే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరల్ని నిర్థారిత స్థాయిల్లో మెయింటేన్ చేయచ్చు. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే....
undefined
రక్తంలో చక్కెర స్థాయిలో ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఇది హైపోగ్లెసిమియాకు దారి తీస్తుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు 70mgdL కంటే తక్కువగా ఉండడం.
undefined
మరి మీరు లో బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నారని ఎలా తెలుస్తుంది. అంటే.. అలసట, చెమటలు పట్టడం, వణుకు, చూపు మందగించడంలాంటి లక్షణాలు కనిపిస్తే.. అవి కంటిన్యూ అవుతుంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.
undefined
లో బ్లడ్ షుగర్ తో బాధపడేవారికి ఇవ్వాల్సిన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వీటితో వారిలోని వ్యాధి లక్షణాల్లో తొందరగా మార్పులు కనిపిస్తాయి.
undefined
అరటిపండు : ఎప్పుడైనా లో బ్లడ్ షుగర్ లాగా అనిపించినట్లైతే వెంటనే ఆ వ్యక్తికి అధిక కార్బ్స్ ఉన్న అరటిపండులాంటివి ఇవ్వాలి.
undefined
ఆపిల్ : ఆపిల్ లో కూడా ఆరోగ్యకరమైన కార్బ్స్ ఉంటాయి. ఇది తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిల్ని నార్మల్ కు తీసుకువచ్చేందుకు చక్కగా సాయపడతాయి.
undefined
ద్రాక్ష : మీ బ్లడ్ షుగర్ లెవల్ 55-70 mgdL మధ్య ఉంటే.. గ్రేప్స్ కూడా తినొచ్చు. ఇవి మీ రక్తంలో కావాల్సిన చక్కెర స్థాయిలను పెంచడంతో దోహదపడుతుంది.
undefined
ఆల్ బుకారా : బ్లడ్ షుగర్ స్థాయిల్ని కంట్రోల్ లో పెట్టే లక్షణాలు ఎండు ఆల్ బుకారా పళ్లలో ఎక్కువగా ఉంటాయి. వీటిల్లోనూ ఎక్కువ కార్బ్స్ ఉన్నప్పటికీ.. రక్తంలో చక్కెర స్థాయిలో తీవ్రంగా పెరిగి ఇబ్బంది పెట్టవు.
undefined
కిస్ మిస్ : బ్లడ్ షుగర్ స్థాయిల్ని నార్మల్ గా మెయింటేన్ చేయడంలో కిస్మిస్ బాగా ఉపయోగపడుతుంది.
undefined
తేనె : రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచడానికి దోహదపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్ 50mgdL కంటే తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం తేనె.
undefined
click me!