ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం ఉంటోంది. అతి తక్కువ ధరకే అన్ని టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ని అందిస్తున్నాయి. దానికి తోడు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించనివారంటూ ఎవరూ ఉండటం లేదు. ఈ కారణాల వల్ల ప్రయోజనాల సంగతి పక్కన పెడితే.. దుష్ప్రయోజనాలు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిల్లో.. పోర్న్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చాలా మంది యువతి ఇంటర్నెట్ ని పోర్న్ వీడియోలు చూసేందుకు వినియోగిస్తున్నారట. సరదాగా ఎప్పుడైనా ఒకసారి చూస్తే తప్పులేదు.. కానీ.. వాటికి బానిసలు మారితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందట.
ఆ వీడియోలను చూసి.. అవంతా పూర్తిగా నిజమని నమ్మి.. ఆ భ్రమలోనే బతికేస్తుంటారు. నిజానికీ.. అసహజత్వానికీ తేడా తెలుసుకోలేకపోతుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోర్న్ ఎక్కువగా చూసేవారు ఊహల్లో బతికేస్తూ ఉంటారు. వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా.. అందులో చూపించనట్లుగానే శృంగారం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా.. ఎన్నో మానసిక సమస్యలకు కారణమౌతుందట. పోర్న్ చూడటం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం..
పోర్న్ లైంగిక జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. ముఖ్యంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు రావడానికి కారణమౌతుందట.
అంతేకాదు.. పోర్న్ చూడటం అలవాటైన వారు నిజజీవితంలో కలయికను పూర్తిగా ఆస్వాదించలేరట. ప్రతిదానిని వీడియోలో చూపించిన దానితోనే పోల్చిచూస్తారట. దానివల్ల అసలైన కలయికను ఆస్వాదించలేక.. ఏదో కోలపోయిన భావనలో ఉండిపోతుంటారట.
రోజూ అశ్లీల చిత్రాలకు చూడటానికి బానిసలుగా మారిన వారు.. టెంప్టేషన్ ఎదురించే సామర్థ్యాన్ని కోల్పోతారు. వారి మెదడు కూడా వాటికి అలవాటైపోయి.. సహజత్వానికి దూరమైపోతుంది.
అంతేకాదు.. ఇలాంటి వీడియోలు చూడాలంటే.. అందరి ముందు చూడలేరు. కాబట్టి.. వీటిని చూడటానికి ఏకాంతం కోరుకుంటారు. కాగా.. దీని వల్ల వారు జనాల్లో కలవడం మర్చిపోతారట. ఏకాంతానికి అలవాటుపడిపోయి.. దాని వల్ల మానసిక సమస్యలు తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు.. పోర్న్ చూడటానికి అలవాటు పడినవారు.. దానిని అనుభవించాలని ఉత్సాహం చూపిస్తారు. ఈ క్రమంలోనే ఎక్కువగా అత్యాచారాలు చేయడానికి మెదడు ఉపక్రమించే ప్రమాదం ఉంది.
కాబట్టి...ఎంత వీలైంత అంత త్వరగా ఈ పోర్న్ చిత్రాలను చూడటం తగ్గించాలి. మరీ ఎక్కువగా వాటికి దూరం కాలేకపోతున్నామని బాధపడితుంటే.. నిపుణుల దగ్గర చికిత్స తీసుకోవడం ఉత్తమం.