FOOD FIGHT WITH CANCER: ఈ ఫుడ్స్ క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతాయి..

Published : May 29, 2022, 10:49 AM IST

FOOD FIGHT WITH CANCER: ప్రతి ఏటా ఎంతో మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీని లక్షణాలు సకాలంలో కనిపించకపోవడం, దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో నేడు ఎంతో మంది దీని బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ సోకకుండా మనల్ని కాపాడుతాయి. అవేంటంటే..   

PREV
19
FOOD FIGHT WITH CANCER: ఈ ఫుడ్స్ క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతాయి..

ప్రాణాంతక రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఎలాంటి లక్షణాలను చూపనందున దీని బారిన పడి ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వంశపారంపర్యంగా, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వివిధ కారణాల వల్ల నేడు ఎంతో మంది ఈ క్యాన్సర్ భూతం బారిన పడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవన శైలి కారణంగానే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకూడదంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడంతో పాటుగా.. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫుడ్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

29

బ్రోకలి (Broccoli).. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ మూలకం పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడగలదు. అంతేకాదు ఇది మన శరీరంలో ఉండే విష పదార్థాలను సైతం బయటకు పంపిస్తుంది. బ్రోకలిని మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల Colorectal cancer సోకే ప్రమాదం చాలా తక్కువ అని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మూత్రాశయ క్యాన్సర్, పెద్దపేగు, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతుంది. 

39

క్యారెట్ (Carrot).. క్యారెట్ లో Alpha carotene,  Bioflavonoids పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే  Lung cancer ‌రాకుండా మనల్ని రక్షిస్తాయి.  క్యారెట్లను తరచుగా తినడం వల్ల 26 శాతం కడుకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

49

ఆకు కూరలైన పాలకూర, బచ్చలికూర, ఆవకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కెరోటినాయిడ్లు, ఫోలేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి DNAను రక్షించడంతో పాటుగా క్యాన్సర్ కణాలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. 

59

దాల్చిన చెక్క (Cinnamon).. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి కణితులను పెరగకుండా అడ్డుపడతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రెగ్యులర్ గా మీ డైట్ లో నాలుగు గ్రాముల దాల్చిన చెక్కను తీసుకుంటే క్యాన్సర్ తొందరగా తగ్గుతుందట. 
 

69

కమల పండ్లు (Lotus fruits).. కమల పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో క్యాన్సర్ ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా ఓవర్ వెయిట్ ను, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే చర్మాన్ని స్మూత్ గా తయారుచేస్తాయి. 
 

79

గ్రీన్ టీ.. గ్రీన్ టీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోటి క్యాన్సర్, lungs ,Esophagus వంటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 
 

89

అల్లం (Ginger).. అల్లంలో దివ్య ఔషద గుణాలుంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపేయడంలో ముందుంటాయి. అల్లం తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు. 

99

పసుపు (Turmeric).. పసుపు ఎన్నో రోగాలకు నివారణగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది పేగు, రొమ్ము, చర్మ క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. దీనిలో క్యాన్సర్ ను ఓడించే గుణాలున్నాయి. క్యాన్సర్ తో పోరాడే.. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. 

click me!

Recommended Stories