Relationship: అత్త కోడలి బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. అత్త, కోడలి మధ్య బంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందం, ప్రేమతో నిండిపోతుంది. లేకపోతే చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. మరి ఈ ఇద్దరి మధ్య బంధం బాగుండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
అత్త–కోడలి బంధం సానుకూలంగా ఉంటే కుటుంబంలో శాంతి, ఆనందం, పరస్పర గౌరవం పెరుగుతాయి. విరుద్ధంగా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారి కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. మరి అత్త–కోడలి మధ్య మంచి బంధం ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం
అత్త తన కోడలిని కొత్తగా ఇంటికి వచ్చిన వ్యక్తిగా కాకుండా తన కుటుంబ సభ్యురాలిగా భావించాలి. అదే విధంగా కోడలు కూడా అత్తను నియంత్రించే వ్యక్తిగా కాకుండా అనుభవజ్ఞురాలిగా చూడాలి. ఈ దృక్పథం వారి మధ్య సంబంధాన్ని మరింత ప్రేమగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
36
ఓపెన్ గా మాట్లాడటం
అత్త, కోడలి మధ్య అనుమానాలు, అపోహలు పెరగకుండా ఉండాలంటే ఓపెన్‌గా మాట్లాడటం అవసరం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని దాచిపెట్టకుండా స్నేహపూర్వకంగా చర్చించాలి. చాలా సందర్భాల్లో చిన్న అపార్థాలే పెద్ద గొడవలకు కారణమవుతాయి. అందుకే మాట్లాడేటప్పుడు మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించడం, ఎదుటివారి భావాలను గౌరవించడం ముఖ్యం. అత్త కోడలికి సలహాలు ఇవ్వేటప్పుడు ఆదేశాల్లా కాకుండా సూచనల రూపంలో చెప్పాలి. కోడలు కూడా అత్త చెప్పే విషయాలను పూర్తిగా తిరస్కరించకుండా ఆలోచించి స్పందించాలి.
వయస్సులో పెద్దదైన అత్తకు గౌరవం ఇవ్వడం కోడలి బాధ్యత అయితే, కోడలిని వ్యక్తిగా గౌరవించడం అత్త బాధ్యత. కోడలికి తన అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని అంగీకరించడం ద్వారా అత్త తన పెద్దమనసును చాటుకోవచ్చు. అలాగే కోడలు కూడా ఇంటి సంప్రదాయాలు, విలువలను గౌరవించడం ద్వారా అత్త మనసు గెలుచుకోవచ్చు. ఇలాంటి పరస్పర గౌరవం వల్ల చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చు.
56
సహనం, క్షమ
ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన ఆలోచనా విధానం, అలవాట్లతో ఉంటారు. ఒకరికి నచ్చింది, మరొకరికి నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో తక్షణం స్పందించి వాదించడం కన్నా కొంచెం సహనం పాటించడం మంచిది. పొరపాట్లు జరిగినప్పుడు వాటిని పెద్దదిగా చూడకుండా క్షమించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది.
66
పనులు, బాధ్యతలు
ఇంటి పనులు, బాధ్యతల విషయంలో కూడా పరస్పర సహకారం అవసరం. కోడలి మీద అన్ని పనుల్ని మోపడం లేదా అత్త పూర్తిగా పక్కకు తప్పుకోవడం రెండూ మంచివి కావు. ఇద్దరూ కలిసి బాధ్యతలను పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది. కలిసి పనులు చేయడం ద్వారా మాట్లాడుకునే అవకాశాలు పెరుగుతాయి, దాంతో బంధం సహజంగానే దగ్గరవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే కోడలికి అత్త సహకారం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అదే సమయంలో కోడలు కూడా అత్తకు గౌరవం, కృతజ్ఞత చూపాలి.
అలాగే కుటుంబంలో మూడో వ్యక్తుల జోక్యం కూడా చాలా సార్లు బంధాన్ని ప్రభావితం చేస్తుంది. బయటివారి మాటలను ఎక్కువగా నమ్మడం, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు వాటిని నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది.