బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ తృణధాన్యాలు బెస్ట్....

First Published Aug 6, 2021, 3:25 PM IST

బరువు తగ్గడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లైతే ఈ ఐదు రకాల తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీకు కావాల్సిన ప్రయోజనాల్ని అద్భుతంగా అందిస్తాయి. వీటితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మిమ్మల్ని రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. గోధుమలకంటే కూడా అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయి. 

బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ పేరుతో ఆహారం మానేయడం.. లేదా రకరకాల ఎక్సర్ సైజులు, క్యాలరీలు చూస్తూ తినడం.. అన్నం పూర్తిగా మానేయడం.. పండ్లు మాత్రమే తినడం లేదా కూరగాయలు మాత్రమే తినడం లాంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు.
undefined
అయితే బరువు తగ్గడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లైతే ఈ ఐదు రకాల తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీకు కావాల్సిన ప్రయోజనాల్ని అద్భుతంగా అందిస్తాయి. వీటితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మిమ్మల్ని రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. గోధుమలకంటే కూడా అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయి.
undefined
మిల్లెట్స్ ఆరోగ్యకరమైన తృణధాన్యాలు, ఇవి గ్లూటెన్ లేనివి, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా గడ్డి కుటుంబం అని పిలువబడే పోయేసి కుటుంబానికి చెందినవి. పూర్వకాలంనుంచి ఈ తృణధాన్యాలు భారతీయ ఆహారపు అలవాట్లలో అంతర్బాగంగా ఉన్నాయి. వీటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ప్రస్తుతం విదేశాల్లోనూ బాగా ప్రజాదరణ పొందాయి.
undefined
రాగులు లేదా ఫింగర్ మిల్లెట్ రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి అవసరమైన ట్రేస్ మినరల్ ఇందులో ఉంటుంది. అంతేకాదు రాగుల్లో అత్యధిక మొత్తంలో కాల్షియం, పొటాషియం కూడా ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సులభమవుతుంది. ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. మధుమేహంతో బాధపడేవారికి కూడా రాగి ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కారణం ఏంటంటే దీంట్లోని అధిక అమైనో ఆమ్లాల కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. మెదడు అభివృద్ధి కోసం ఈ ఆహార ధాన్యాన్ని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.

జొన్నలు : జొన్నల్లో విటమిన్ బి, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు -ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్‌లతో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. జీవక్రియను పెంచడంలో, జుట్టు,చర్మ నాణ్యతను మెరుగుపరచడంలో బి విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి, మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, రోజువారీ తీసుకోవాల్సిన ఫైబర్ ఇంటేక్ లో 20 శాతం 96 గ్రాముల జొన్నల్లో లభిస్తుంది. ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

సజ్జలు .. బజ్రా లేదా పెర్ల్ మిల్లెట్ : బజ్రా లేదా పెర్ల్ మిల్లెట్‌లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీంట్లో ఆశ్చర్యకరంగా చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ధాన్యాల్లోకెల్లా ఉత్తమమైనది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ రోజువారీ కేలరీల సంఖ్యను పెంచకుండా, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ప్రతీరోజు మీ ఆహారంలో సజ్జలు చేర్చడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అనేక రకాల క్యాన్సర్, కొలెస్ట్రాల్ నియంత్రణ, ఆస్తమాను నివారించవచ్చు.
undefined
రాజ్‌గిరా లేదా అమరాంత్ : దీన్నే ఎర్రతోటకూర గింజలు అంటారు. అమరాంత్ అనేది ఒక పురాతన ధాన్యం. ఇది ఇటీవల కాలంలో విస్తృత ప్రజాదరణ పొందింది. ఈ ఆహార ధాన్యంలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అమరాంత్‌లో అధిక మొత్తంలో మాంగనీస్ ఉంటుంది, కేవలం ఒక మీల్ తో మీ రోజువారీ పోషక అవసరాలను మించిపోతుంది. ఈ ట్రేస్ మినరల్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొన్ని నాడీ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కండరాలను నిర్మించడానికి, జీర్ణ సంబంధింత ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. నిజానికి, అమరాంత్ లో క్వినోవా కంటే ఎక్కువ పోషకవిలువలుంటాయి.
undefined
కంగ్ని లేదా ఫాక్స్‌టైల్ మిల్లెట్ : వీటినే కొర్రలు అంటారు. కొర్రలు మామూలుగా సెమోలినా లేదా బియ్యం పిండిగా లభిస్తుంది. దీంట్లో ఇనుము, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఫాక్స్‌టైల్ మిల్లెట్‌లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఆహారపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు లక్షణాల వల్ల బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి మంచి ఎంపిక ఇది. . ఫాక్స్‌టైల్ మిల్లెట్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బాగవుతుంది.
undefined
click me!