అన్నంలో కొలెస్ట్రాల్, ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు. కాబట్టి మనం అన్నాన్ని తింటే బరువు పెరుగుతామన్న అపోహలేమీ పెట్టుకోవద్దు. అన్నానికి బదులుగా మనం నిత్యం తీసుకునే నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది. అంతేకాని అన్నం తినడం వల్ల మన శరీరానికి కొవ్వు పెరగదు.