Flirting Tips: పాతవే అయినా.. అమ్మాయిలను మీ ప్రేమలో పడేయడంలో ఈ టిప్స్ బాగా పనిచేస్తాయి తెలుసా..

First Published | Feb 4, 2022, 4:10 PM IST


Flirting Tips : ఒక అమ్మాయితో ప్రేమలో పడటం ఎంత ఈజీనో.. వారికి మీ ప్రేమను చెప్పడం అంత కష్టతరమైన పనే కదా. అవును మరి ప్రేమించడం సులువైన పనే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడం అంటే మాటలు కావు. అందులోనూ ఎలా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందోనన్న టెన్షన్ కూడా ఉంటుంది. 
 


Flirting Tips: కరోనా మహమ్మారితో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఇప్పుడిప్పుడే పాత రోజులు మెళ్లి మెళ్లిగా వస్తున్నాయి. ఇక కరోనా టైం లో ప్రేమికుల బాధ అంతా ఇంతా కాదు సుమా.. మనస్సు దోచిన అమ్మాయి లేదా అబ్బాయికి తమ ప్రేమ విషయాన్ని చెప్పాలంటే వాట్సాప్ నే ఎక్కువుగా వాడేవారు ఆ రోజుల్లలో. వాట్సాప్ చాట్ , ఎమోజీలతో తమ ప్రేమను తెలిపే దారులను ఎంచుకున్నారు. వాటివల్ల కొందరి లవ్ మ్యాటర్ సక్సెస్ అయితే మరికొందరు డిసప్పాయింట్ అయ్యారు. 

ఏదేమైనా ప్రేమను వ్యక్తపరచడానికి కొన్ని పద్దతులు బాగా ఉపయోగపడతాయి. అవి పాతవే అయినా.. మీ లవ్ సక్కెస్ అవ్వడం పక్కాగా జరుగుతుంది. ఒకరిని మీ ప్రేమలో పడేయాలంటే ముందుగా మీకు ఉండాల్సింది వారి పట్ల ప్రత్యేకమైన ‘కేరింగ్’. ఇదే వారి మనస్సును దోచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది వాట్సాప్ ద్వారా అయితే చూపలేం కదా.. మరి ఇంతకి ప్లర్టింగ్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 


మెచ్చుకోవడం:  ‘వావ్ ఎంత బాగున్నావో తెలుసా.. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఈ రోజు నువ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావ్. నీతో కలిసి సమయాన్ని గడుపుతుంటో మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది’ లాంటి మాటలు చెబితే కూడా ఎదుటి వారికి మీపై ఇష్టం పెరుగుతుంది. వారి మనస్సు మీపై మళ్లుతుంది. వారితో మాట్లాడుతున్నంత సేపు చిరునవ్వులను చిందిస్తే కూడా వారి మిమ్మల్ని ఇష్టపడుతారు. ఈ ట్రిక్ ను పాటిస్తే కూడా మీ ప్రేయసి మీ ప్రేమలో తొందరగా పడుతుంది. కానీ ఏది చేసినా.. మీ ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి.
 

చేతిపై ముద్దు పెట్టండి: మీ మనసుకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి చేతిని తీసుకుని సున్నితంగా కిస్ చేయండి. ఇలా చేయడం వల్ల వారికి మీపై ఉన్న ఆసక్తి బయటపడుతుంది. అంతేకాదు ఆ ముద్దు ఆప్యాయతను కూడా వారికి తెలియజేస్తుంది. ఇలా కిస్ చేయడం చాలా మర్యాదగల పద్దతి. అంతేకాదు మీది స్వచ్ఛమైన ప్రేమ అని ఈ ముద్దు తెలియజేస్తుంది. 
 

I Love You कहने में तो बढ़ा आसान लगता है, लेकिन जब ये 3 शब्द किसी से अपने प्यार का इजहार करने के लिए कहा जाए, तो इंसान बहुत असहज हो जाता है।

షేరింగ్:  మీ అలవాట్లే ఎదుటి వారు మీ ప్రేమను అంగీకరించాలా? లేదా? అనే అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు ఇష్టపడిన వ్యక్తితో మీ ప్రతి విషయాన్ని షేర్ చేయండి. అది ఎలాంటి విషయమైనా సరే. సంతోషంలో ఉన్నా.. బాధలో ఉన్నా సరే ప్రతి విషయం వారితో చెప్పండి. ఈ అలవాటే మీలో వారికి అన్నింటికన్నా ఎక్కువగా నచ్చుతుంది. 
 

అబ్బాయిలకు మాత్రమే:  ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అమ్మాయిలకు బదులుగా మీరే డోర్ తీయాలి. అంతేకాదు రెస్టారెంట్లోకి వెళ్లినప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్లినప్పుడు కుర్చీని జరిపి కూర్చోమని చెప్పండి. ఇది చాలా చిన్న విషయమే అయినా.. వారిని మీ ప్రేమలో పడేలా చేస్తుంది. ఇంకోంటి ఏంటో తెలుసా.. ఈ సింపుల్ చిట్కా వల్ల వారు తొందరగా ఇంప్రెస్ అవుతారు. 

Latest Videos

click me!