గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం 1986లోనే వీటిని ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఒక్క తమిళనాడులోనే జవహర్ విద్యాలయాలు లేవు. ఇందులో చేరాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సీబీఎస్‌సీ సిలబస్ ఉంటుంది. 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. 6,7,8 తరగతులు ఫ్రీగా చదువు చెబుతారు. 9,10 తరగతులకు మాత్రం నామ మాత్రంగా 600 ఫీజు తీసుకుంటారు. ఇక్కడ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తారు. స్మార్ట్‌బోర్డ్ , ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు , Wi-Fi కనెక్టివిటీ, పవర్ బ్యాకప్‌తో వినూత్నంగా తరగతులు చెబుతారు. అందువల్ల ఇది మీ పిల్లలకు ఎంతో మంచి స్కూల్ అవుతుంది.