మాతృత్వం ఓ అందమైన భావన. డెలివరీ స్త్రీకి పునర్జన్మ అంటారు. దీనికి కారణం లేకపోలేదు.. ఓ ప్రాణికి ఊపిరిపోయడానికి శరీరం మొత్తాన్ని సిద్ధం చేయడం.. దాంట్లో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు.
అందుకే మన పెద్దలు గర్భిణి సమయాల్లో అన్ని పనులూ తేలిగ్గా చేసుకోవాలని చెప్పేవారు. కానీ నేటి రోజుల్లో గర్భిణీ కాగానే అసలు ఏ పనీ ముట్టరు. దీనివల్ల డెలివరీలో కాంప్లికేషన్స్, సిజేరియన్లు ఎక్కువవుతున్నాయి.
అలా కాకుండా నార్మల్ డెలివరీ కావాలంటే.. పాపాయితోపాటు తల్లీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇవి మిమ్మల్ని ప్రసవానికి సిద్ధం చేస్తాయి.
అప్పటివరకు ఆరోగ్యం, ఇంకా ఇతర విషయాలు ఎలా ఉన్నా.. గర్భిణీ అవ్వగానే ఆ తొమ్మిదినెలలు ఎలాంటి సమస్యలు లేకుండా గడవడం.. ప్రసవం సమయంలో ఇబ్బందులు ఉండకుండా ఉండడమే అల్టిమేట్ గోల్ గా ఉంటుంది.
అందుకే మిమ్మల్ని మీరు నార్మల్ డెలివరీకి ప్రిపేర్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి.. మిగతా అంశాలు సహకరిస్తే నార్మల్ డెలివరీకి మించిన మంచి విషయం ఇంకొకటి లేదు.
దీనికోసం ప్రెగ్నెన్సీ వర్కవుట్స్ సహాయపడతాయి. ఈ వర్కవుట్స్ మిమ్మల్ని నార్మల్ డెలివరీకి ప్రిపేర్ చేయడమే కాదు. ప్రసవానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తాయి.
అలాంటి కొన్నిఅలాంటి కొన్ని వ్యాయామాలతో ప్రసవాన్ని అంత ఇబ్బంది లేకుండా దాటేయవచ్చు. వ్యాయామాలతో ప్రసవాన్ని అంత ఇబ్బంది లేకుండా దాటేయవచ్చు.
కేజల్ ఎక్సర్ సైజ్ : నడుము కింది కండరాలు ప్రసవంలో కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి వీటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల గర్భిణీ సమయంలో వచ్చే అనేక సమస్యల్ని అధిగమించవచ్చు.
స్క్వాటింగ్ : డీప్ స్క్వాట్స్ మీ పెల్విక్ కండరాల్ని ఓపెన్ చేసి, స్ట్రెచ్ అయ్యేలా చేస్తాయి. దీనివల్ల చైల్డ్ బర్త్ అంత పెయిన్ ఫుల్ గా ఉండదు.
పెల్విక్ టిల్ట్ లేదా యాంగ్రీ క్యాట్ : ఈ వ్యాయామాలతో కడుపుకండరాలను బలోపేతం చేయవచ్చు. దీనివల్ల డెలివరీ సులభం అవుతుంది.
బటర్ ఫ్లై స్ట్రెచ్ లు : ఈ బటర్ ఫ్లై స్ట్రెచ్ లతో మీ నడుము, తొడలు, పెల్విస్ బలంగా తయారవుతాయి. దీనివల్ల డెలివరీ సమయంలో మీరు సరైన పోస్చర్ లో ఉండేలా సాయపడుతుంది.
బ్రీతింగ ఎక్సర్ సైజులు : శ్వాస సంబంధిత వ్యాయామాలు మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ప్రసవం సమయంలో వచ్చే నొప్పిని తట్టుకునేలా చేస్తాయి. వీటిని తరచుగా చేయడం వల్ల డెలివరీ చాలా ఈజీ అవుతుంది.